Thursday, November 7, 2024

నగల మూటను వానరులకు అందేవిధంగా కిందికి జారవిడిచిన సీత

రామాయణమ్ 83

పెనుగాలికి ఊగిపొయె చివురుటాకులాగా వణికిపొతున్నది సీతమ్మ.

 అయినా ధైర్యము కోల్పోలేదు. రాజపుత్రి ,రామపత్నికదా! వరదలై పారుతున్న దుఃఖ్ఖాన్ని అదుపుచేసుకోలేక సతమతవుతూ రావణుని ఎదిరిస్తూ మాట్లాడసాగింది.

Also read: ‘రామా,లక్ష్మణా, కాపాడండి’ అంటూ రోదించిన సీత

‘‘ఒంటరి స్త్రీని అపహరించిన నీవూ ఒక వీరుడవేనా?  నీదీ ఒక శౌర్యమేనా?  నీ వంశము గొప్పదని, చాలా గొప్పవాడినని బీరాలు పలికావు ఇదెనా నీ గొప్పతనము?  రాముని ఎదిరించి నిలువలేక ఒక దొంగ లాగా వచ్చి అపహరించటానికి సిగ్గుగా లెదా? ఒక ముహూర్త కాలము నిలువు నీవు వీరుడవైతే రామలక్ష్మణుల బాణాగ్నిలొ మిడతలాగా దగ్ధమైపొతావు.  వారి కంటబడ్డావా నీవు, నీ పని అయిపొయినట్లే. ముల్లొకాలలొ ఎక్కడికెళ్ళినా  నీ మృత్యువు నీవెంటే వచ్చి నిన్ను కౌగలించుకుంటుంది.’’

ఈ విధముగా మాట్లాడుతూనె తను పరిశీలనగా క్రిందకు చూస్తున్నది.

ఒక చొట అయిదుగురు వానరులు ఒక పర్వతము మీద కనబడ్డారు.

Also read: రావణ ఖడ్గప్రహారంతో కుప్పకూలిన జటాయువు

,అంత దీన స్థితిలొ కూడా ఆవిడ చురుకుగా ఆలొచించింది. ధైర్యము కొల్పోలేదు. తన బంగరు ఉత్తరీయము తీసి అందుతొ పాటు నగలు కూడా జారవిడిచింది. ఆ వానరులు తన గురించి రామలక్ష్మణులకు చెప్పాలనే ఉద్దెశముతొ అలా జార విడిచిందావిడ. తొందరగా వెళ్ళే ఉద్దేశముతో ఉన్న రావణుడు ఆమె చేసిన పని గమనించ లేదు…

పైనించి పడుతున్న వస్త్రాన్నీ ,ఆకాశములొ తీసుకుపోబడుతున్న సీతాదేవిని తమ పచ్చని నేత్రాలతో రెప్పవాల్చకుండా తలపైకిఎత్తి అలాగే చూస్తూ ఉండి పోయారు వానరులు.

మహాభుజంగమును పెట్టుకొన్నట్ట్లుగా  ఆ సాధ్వీమణిని చంకన పెట్టుకొని లంకలొ ప్రవెశించాడు రావణుడు.

లంకలొ ఆ విధంగా మృత్యువు ప్రవేశించింది.

మృత్యువు! మృత్యువు! మృత్యువు!

 లంకలో మృత్యువు రావణ అంతఃపురంలో ప్రవేశపెట్టబడ్డది.

Also read: రావణుడిని తీవ్రంగా హెచ్చరించిన జటాయువు

అంతఃపురములోని సేవికలకు వెంటనే ఆజ్ఞలు జారీచేయబడ్డాయి. ఎవరూ సీతాదేవిని బాధించరాదు. సీతాదేవికి కష్టముకలుగచేసినవాడు ఎవడైనా సరే వాడి కుత్తుకలుత్తరింపబడతాయి అని హెచ్చరికలివ్వబడ్డాయి.

‘‘ఆవిడ ఏది కోరితే అది ఉత్తరక్షణంలో ఆవిడముందు ఉండాలి. నేను అడిగితే ఒకటీ సీతాదేవి అడిగితే ఒకటీ కాదు. ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞగా భావించండి’’ అని ఆదేశించాడు రావణుడు.

అంతఃపుర కాంతలను ఆ విధముగా ఆదేశించి బయటకు వచ్చి ఇక మిగిలిన కార్యమేమున్నదా అని ఆలోచించాడు.

రావణుడు వెంటనే ఎనిమిదిమంది మహాబలశాలురైన రాక్షస గూఢచారులను రావించాడు. వారిని జనస్థానమునకు తక్షణమే వెళ్ళమని ఆదేశాలు జారీచేశాడు.

Also read: సీతను రథములో బలవంతంగా ఎక్కించుకున్న రావణుడు

‘‘మీరంతా రాముడి కదలికలను వేయికన్నులతో గమనించండి. సకల మాయోపాయాలు ప్రయోగించి ఏదోవిధముగా అతనిని సంహరించండి. మన ఖరదూషణుల హత్యకు ప్రతీకారము తీర్చుకొనవలె!

‘‘రాముడన్న నా హృదయంలో అంతులేని క్రోధము రగులుతున్నది ,నా అధీనములోని జనస్థానములో మనవారెవ్వరూ లేకుండా హతమార్చినాడు. మనకున్న భయంకరమైన శత్రువు రాముడు. రణరంగములో అద్భుతపరాక్రమము చూపిన మీ అందరినీ పంపుటకు గల కారణము రామసంహారమే.’’

వెంటనే ఆ ఎనిమిదిమంది రాక్షసులు ఎవరికీ కనపడకుండా  జనస్థానము దిశగా సాగిపోయారు.

Also read: రావణుడికి సీతమ్మ హెచ్చరిక

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles