కొవిడ్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించినా సింగరేణి కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి విధులకు హాజరయ్యారని ఏఐటీయూసీ ఇల్లందు బ్రాంచి డిప్యుటీ ప్రధాన కార్యదర్శి సారయ్య తెలిపారు. దేశంలో విద్యుత్ కు అంతరాయం జరగకుండా పవర్ ప్లాంట్ల కు బొగ్గు రవాణా చెయడం జరిగింది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారం కొవిడ్ తొలి వ్యాక్సిన్ ను వేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. వాక్సిన్ ను తొలుత పోలీస్, మెడికల్ సిబ్బంది కి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో సింగరేణి కార్మికులకు కూడా వాక్సిన్ వేయాలని కోరారు.
ఇదీ చదవండి : రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
కరోనాను సైతం లెక్క చేయకుండా 64 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా కొవిడ్ సహాయనిధికి 40 కోట్లు విరాళం ఇచ్చినట్లు గుర్తు చేశారు. కొవిడ్ కారణంగా 26 మంది కార్మికులు, ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తొలివిడత వాక్సినేషన్ లో సింగరేణి కార్మికులను చేర్చకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సారయ్య సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు