- సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ధర్నా తర్వాత పూచీ
గోదావరిఖని లోని సీఎం పిఎఫ్ ఆఫీస్ వద్ద సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో చేసిన ధర్నా ఫలితంగా సీఎంసీఎఫ్ (CMPF) కమిషనర్ కింది సమస్యలను పరిష్కరించడానికి ఒప్పుకున్నారని జనరల్ సెక్రటరీ మందా నరసింహారావు గురువారంనాడు తెలిపారు.
1. 2017-18 వడ్డీ 8.65 శాతం, 2018-19 వడ్డీ 8.5శాతంకు నెలరోజుల్లో సరి చేసిస్తామని తెలిపారు
2. 2019-20 కి సంబంధించిన లెక్కలు యాజమాన్యం ఇంకా పంపలేదని, పంపితే అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
3. కారుణ్యం వారికి జరిగిన పెన్షన్ నష్టాన్ని 15 రోజుల్లో లెక్కింపులో వచ్చిన లోపం వలన పెన్షన్ తక్కువ వచ్చిన వారికి సరి చేసి ఇవ్వడానికి అంగీకరించారు.
4. దిగిపోయిన చివరి నెల నుండి పెన్షన్ లెక్కించడానికి అంగీకారం తెలిపారు
5. ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వారికి సంబంధించిన లెక్కలు యాజమాన్యం పంపితే తప్పకుండా పేమెంట్ చేయడానికి అంగీకరించారు
6. ఒక ఏరియా నుండి మరొక ఏరియా కి ట్రాన్స్ఫర్ అయిన కార్మికులకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అంగీకరించారు
7. కాంట్రాక్టు వారికి సీఎంపిఎఫ్ లెక్కలు యాజమాన్యం సరైన పద్ధతిలో పనులు ఆలస్యం అవుతున్నాయని కొందరిలో వివి స్టేట్మెంట్లు నామినేషన్ లేకుండా మేనేజ్మెంట్ పంపడం వలన ఆలస్యం జరుగుతుందని అనే విధంగా ఉంటే అప్డేట్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు
Also read: సింగరేణి అధికారులకు పిఆర్‌పి చెల్లింపుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్