సింగరేణి ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అంథోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో టిబిజికేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆమెకు మెమోరాండం సమర్పించారు.
ఇది చదవండి: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆందోళన
మెమొరాండంలోని ముఖ్యాంశాలు:
1.జీవో ఎంఎస్ నెంబర్ 59 ప్రకారం కోటి రూపాయల వరకు ఉన్న పబ్లిక్ వర్క్స్ లో ఎస్సీ ఎస్టీలకు 21 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
2.665 ఎస్పీ బ్యాక్ లాగ్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు.
3.జీవో 34 ప్రకారం 235 మంది గిరిజన గృహ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి.
4.సింగరేణి ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ పదవి కాలపరిమితిని పొడిగించాలి.
5.రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు పరచడంలో అటు ఆంధ్ర ఎస్సీ ఎస్టీలకు గానీ, ఇటు తెలంగాణ ఎస్సీ ఎస్టీలు గాని లాభపడకుండా జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు.
6.గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోస్టర్ రిజిస్టర్లు యొక్క తనిఖీ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలి.
7.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తో పిరియాడికల్ రివ్యూ మీటింగ్ లను యాజమాన్యం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
ఇది చదవండి: కొత్తగూడెంలో జరిగిన 99వ సింగరేణి వార్షిక జనరల్ బాడీ మీటింగ్
సానుకూలంగా స్పందించిన కవిత:
ఉద్యోగుల సమస్యలను విన్న ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన సమస్యల పరిష్కరానికి చర్యలు చేపడతానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్ సెక్రటరీ ఎం.రాజిరెడ్డి తో పాటు సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషనకు చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు.
ఇది చదవండి: 131 వ ఏట అడుగుపెట్టిన సింగరేణి