మంచిర్యాల: సింగరేణిలో అమలయ్యే పదవీవిరమణానంతర వైద్యసేవల పథకంలో 20% మాత్రమే రిటైరైన కార్మికులు రు.40,000/- చెల్లించి వైద్యసేవల పథకంలో చేరినారు. మిగతావారు రు.40,000/- కట్టే స్థోమత లేక(చాలీ చాలని పెన్షన్‌తో ) ఈ పథకమంలో చేరలేక పోయినారు. పథకములో చేరినవారికి అత్యవసర సమయంలో అనుమతి పొందిన హాస్పిటల్స్ కూడ నగదురహిత చికిత్స నిరాకరిస్తున్నారు. అప్పో సొప్పో చేసి సొంతంగా హాస్పిటల్ బిల్లు కడితే కంపెని రింబర్స్ చేయడానికి 6 నుంచి 12 నెలల కాలం పడుతోంది. అది కూడ కట్టిన బిల్లులో 3వ వంతు మాత్రమే రియంబర్స్మెంట్ చేస్తున్నరు. నగదు రహిత చికిత్స అందించి నట్లైతె హాస్పిటల్స్ కు పూర్తి బిల్లు చెల్లిస్తారు. రియింబర్స్మెంటు అయితేనేమొ బిల్లు కోతకోసి కార్మికునికి నష్టం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం, ఒప్పంద హాస్పిటల్స్ కలిసి విశ్రాంత కార్మికులకు తీరని అన్యాయం కావాలనే చేస్తున్నట్లుగా ఉంది. నగదురహిత చికిత్స ఇవ్వనప్పుడు నగదురహిత ఒప్పంద హాస్పిటల్స్ వల్ల ప్రయోజనం ఏమి లేదు. కార్మిక సంఘాలు గాని యాజమాన్యం గాని ఎవ్వరు ఈ విషయంలో చొరవ చూపడం లేదు.
వివక్ష
ఈ పథకం అమలులో కూడా ఎంతో వివక్ష చూపిస్తున్నారు. జీవిత కాలంలో కార్మికులకు 8 లక్షల రూపాయలు, అధికారులకు 25 లక్షల పరిమిత చికిత్స అందిస్తున్నారు. ఇదిగాక అధికారులకు సంవత్సరానికి రు. 35,000/- ఇతర వైద్య ఖర్చుల నిమిత్తం ఇస్తున్నారు.
ఎట్లాగూ, భార్య భర్త ఇద్దరికి కలిపి 8 లక్షల రూపాయలకు మించి చికిత్స అందించరు. అలాంటప్పుడు, రియంబర్స్మెంటు విషయంలో బిల్లులు కట్ చేయడం ఎందుకు? 8 లక్షల రూపాయలు అయిపోయేంతవరకు బిల్లులు పూర్తి రియింబర్స్ చేయవచ్చు కదా! ఈ పథకంలో క్యాన్సర్ లాంటి కొన్ని ధీర్గకాలిక జబ్బుల చికిత్సకు అయ్యే ఖర్చు మీద పరిమితి లేదు. బాగానే ఉంది కాని 8 లక్షల రూపాయలు పూర్తిగ అయిపోయిన తరువాత మాత్రమే అపరిమిత చికిత్స అందిస్తామనే నిబంధన ఉంది. మొత్తం 8 లక్షలు క్రానిక్ జబ్బులకు అయిపోతే, ఆ తరువాత వచ్చే సాధారణ జబ్బులకు మొండి చెయ్యి చూపిద్దామనే కదా!
‘‘సార్, మేము మీకు చేసే విన్నపమేమిటంటె, ఈ పథకంలో చేరలేక పోయిన విశ్రాంత కార్మికులందరికి యాజమాన్యమే రు. 40,000/- చెల్లించి నిరుపేద విశ్రాంత కార్మికులందరికి ఈ పథకం వర్తింప చేయాలి. అన్ని అనుమతించిన అన్ని హాస్పిటల్స్ లో నగదు రహిత చికిత్స అందించి ఏ ఆదరవు లేని మాజీ కార్మికులను ఆదుకోవాలి. అనుమతి లేని హాస్పిటల్లలో అత్యవసర చికిత్స పొందినట్లైతె పూర్తి రింబర్స్మెంట్ కనీసం నెల లోపు వచ్చేటట్ల చూడాలి. కార్మికులకు అధికారులకు ప్రాణం ఖరీదులో వ్యత్యాసం తొలగింప చేసి సమానమైన చికిత్సలందించాలని వేడుకొంటున్నాము. 8 లక్షలు సాధారణ జబ్బులకు మాత్రమే వినియోగించి, క్రానిక్ జబ్బులకు పరిమితి లేని చికిత్స అందివ్వాలి. అయ్యా, దయచేసి మీరు చొరవ తీసుకొని ఈ పథకంలోని అవకతవకలు సవరింపజేసి కార్మికులకు న్యాయం చేయాలని రిటైర్డ్ కార్మికులు కోరుతున్నారు’’ అంటూ ఉద్యోగ విరమణ చేసిన కార్మికులు ఒక విజ్ఞాపన పత్రంలో వేడుకున్నారు.