- 17 ఏండ్లుగా కొనసాగుతున్న దీక్షలు
సింగరేణిలో గనుల్లో వాతావరణం కారణంగా కృత్రిమమైన గాలి తదితర కారణాల వల్ల గైర్హాజరై డిస్మిస్ అయిన బొగ్గు గని కార్మికుల ఘోష ఇంతా అంతా కాదు. వారి వెతలు తీరడంలేదు. 17 సంవత్సరాల నుంచి మందమర్రి లోని సింగరేణి జీఎం కార్యాలయం సమీపంలోనూ, నాగపూర్-హైద్రాబాద్ రహదారి పక్కనా నిరాహారదీక్ష లు చేస్తున్నారు. శిబిరం మొదట జిఎం కార్యాలయం వద్ద ఉండగా అక్కడ అధికారులు అభ్యంతరం తెలపడంతో రహదారి పక్కన జీఎం కార్యాలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసుకున్నారు. డిస్మిస్డ్ కార్మికులు వారి కుటుంబాలకు చెందిన వారు వంతుల వారిగా దీక్షలలో పాల్గొంటూ వస్తున్నారు.
Also Read : ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
వేలాది మంది డిస్మిస్
వేలాది మంది డిస్మిస్ కాగా వందల లో ఉద్యోగాలు వచ్చాయి. 250 మందికి పైగా మరణించారు. 520 మంది పదవి విరమణ వయస్సు దాటింది. ఇంకో 2వేల మంది మిగిలారు.. తమకు ఒక అవకాశంగా ఉద్యోగం కల్పించాలని.. చనిపోయిన.. వయస్సు దాటిన వారిపైన ఆధారపడినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని.. పెన్షన్ తో పాటు వైద్య ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి సింగరేణి ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
Also Read : భగవంతుడుంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి – భగత్ సింగ్
జీఎం కార్యాలయం వరకూ ప్రదర్శన
బుధవారం మందమర్రి జీఎం కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.. డిస్మిస్డ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు బి. రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందూ, ఏర్పాటు అయినతర్వాతా ఎమ్మెల్యే లు.. ఎంపీలు.. మంత్రులు తమకు తమ శిబిరాల వరకు వచ్చి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విదంగా 17 ఏళ్ళుగా తాము తమ కుటుంబ సభ్యులు దీక్షలు చేస్తున్నారని అన్నారు.. మానవీయ కోణంలో డిస్మిస్డ్ కార్మికుల సమస్యలను అలాగే తీవ్ర అన్యాయానికి గురి అయిన విఆరెస్ డిపెండెంట్ల కు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. విఆర్ఎస్ డిపెండెంట్ ల సమస్య గతంలో పలు మార్లు అసెంబ్లీ లో చర్చకు రావడం, సీఎం స్థాయిలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమస్య ఇంతవరకూ పరిష్కారానికి నోచుకోలేదు.