- రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత మహిళ, రెండో భారతీయ క్రీడాకారిణి
- చైనాకు చెందిన జియావోపై సునాయాసంగా విజయం, కంచు పతకం కైవసం
టోక్యో: సింధూ టోక్యోలో చరిత్ర సృష్టించింది. రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న ఒకే ఒక భారత క్రీడాకారిణిగా చరిత్ర పుటలలోతన పేరు నమోదు చేసుకున్నది. ఇద్దరే ఇద్దరు భారతీయులు ఈ ఘనత సాధించారు. సింధు కాక మరొకరు పహిల్వాన్ సుశీల్ కుమార్. అతడు రెండు సార్లు పతకాలు గెలుచుకున్నాడు. బీజింగ్ లొ 2008లోజరిగిన ఒలింపిక్స్ లో కుస్తీ పోటీలలో సుశీల్ కుమార్ కాంస్య పతకం గెలుచుకోగా ఆ తర్వాత లండన్ లో 2012లో జరిగిన ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకున్నాడు. ప్రపంచంలో నలుగురు మహిళలే ఒకటి కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలు గెలుచుకున్నారు. ఆ నలుగురిలో ఒకరు మన సింధూ కావడం గర్వకారణం.
ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో చైనాకు చెందిన హీబింగ్ జియావోని రెండు వరుస గేమ్స్ లో 21-13, 21-15 సెట్ల తేడాతో సింధూ ఓడించింది. శనివారంనాడు ప్రపంచంలో నంబర్ వన్ బాడ్మింటన్ క్రీడాకారిణి, చైనాకే చెందిన టాయ్ జూ యింగ్ చేతిలో వరుసగా రెండు గేమ్స్ 21-18, 21-12 సెట్ల తేడాతో పరాజయం చెందింది. దాని తాలూకు దిగ్భ్రాంతి, నిరాశల నుంచి కోలుకొని ఆదివారం సాయంత్రం బ్రహ్మాండంగా ఆడి చైనాకు చెందిన మరో క్రీడాకారిణి జియావోను ఓడించి రజత పతకం ఖాయం చేసుకున్నది.
ఆదివారం ఆట మొదలైన క్షణం నుంచీ సింధూ తన ఆదిక్యం ప్రదర్శించింది. తైపీస్ క్రీడాకారిణి చాలా సార్లు షటిల్ ని కోర్టు ఆవలకు కొట్టి సింధూకు పాయింట్లు ఇచ్చింది. మొదటి గేమ్ ప్రారంభంలో 4-0 ఆధిక్యం సాధించిన సింధూ కొంత కలవరపాటుకు గురి కావడంతో జియావో 5-5కు చేరుకుంది. ఆ తర్వాత 6-5 ఆధిక్యం కూడా సాధించింది. అక్కడ జియావోని నిలిపివేసి సింధూ విజృంభించింది. 11-8 ఆధిక్యం సంపాదించడంతో సింధూ గండం నుంచి గట్టెక్కి గేమ్ గెలుచుకున్నది. రెండో గేమ్ లో సునాయాసంగానే గెలుపొందింది. ఏ స్థాయిలోనూ తైపీస్ క్రీడాకారిణి సింధూని దాటి వెళ్ళలేదు. సింధూ షాట్లు సాధికారికంగా, ప్రదిభావంతంగా, శక్తిమంతంగా కొట్టి ప్రేక్షకులను మెప్పించింది.
గురు సమానులు రామచంద్ర మూర్తిగారు….ఈ ఆర్టికల్ లో కొన్ని తప్పులు ఉన్నాయి దయచేసి గమనించగలరు.. రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో రోజుకు పతకం సాధించారు..మీరు రాసిన కథనంలో రెండు రజత పతకాలుగా ముద్రించారు… అలాగే తాయ్ ఈ యంగ్ చైనా క్రీడాకారిణి కాదు ఆమె చైనీస్ తైపీ దేశస్థు రాలు.. సింధూ కూడా ఈసారి కాంస్య పతకం సాధించింది గత ఒలింపిక్స్ పోటీలో రజతం గెలుచుకుంది..
Thank you very much, chandrasekhar garu. I will get the mistakes corrected. Thank you very much once again.