మౌనం గొప్పది కాదు
మౌనం సమస్యలకు భాష్యం కాదు
మౌన వ్యాఖ్య ప్రకటితం
అప్రకటిత హింస నాపదు!
కళ్ళ ముందే కీచకులు చెలరేగితే
ఆశలన్ని అగ్నికి ఆహుతవుతుంటే
రాజకీయ సమీకరణాలు,
మౌనం,
మరణ మృదంగాన్ని
హింస ధ్వని వినిపిస్తుంటే
నిప్పులు ప్రవహించాల్సిన దేహంలో
నీరు పుడుతోందా?
ఈ మౌనం గతి మార్చే ధ్యానం కాదు
క్లైబ్యం మాస్మగమ
స్పందించే ప్రతీ మానవుడికి అర్ధమవుతుంది
మణిపూర్ నీరోలకు మాత్రం సారో నీరవుతుంది !
-వీరేశ్వర రావు మూల ©
Also read: మణిపూర్
Also read: చర్విత చర్వణం