Thursday, November 21, 2024

ఎన్నికల అధికారి మిమ్మల్ని అడగాలా: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారంనాడు విచారణ జరిపింది.  అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎన్నికలు నిర్వహించేలా ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది. విచారణలో ఈసీ వాదనలను ప్రభుత్వ తరపు న్యాయవాది తప్పుపట్టారు. రూ. 40 లక్షల నిధులకు గాను ఇప్పటికే రూ. 39 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరగా దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

ఎన్నికల నిర్వహణపై తమను ఎన్నికల కమిషన్ సంప్రదించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదించాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది. ఏయే చోట్ల ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది కోర్టు.

ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా మాసాలుగా ప్రభుత్వంతో ఘర్షణామయమైన వాతావరణంలో పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం రమేష్ కుమార్ స్థానంలో తమిళనాడుకు చెందిన ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. రమేష్ కుమార్ కోర్టుకెక్కారు. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఆయనకు అనుకూలంగా నిర్ణయం రావడంతో ఆయనను తిరిగి ఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తించడానికి గవర్నర్ ఆదేశించారు. ఆ తర్వాత రమేష్ కామర్ తనతో ప్రభుత్వం సహకరించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles