Wednesday, December 25, 2024

సంకల్పాలు పెంచుకోవాలా, తుంచుకోవాలా?

భగవద్గీత – 29

శ్రీ రామచంద్రుడికి కొన్ని సందేహాలు కలిగాయి… అవి…

జీవితము అంటే ఏమిటి?

మోక్షము అంటే ఏమిటి?

అసలు మనస్సు అంటే ఏమిటి?

మనిషి మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది!

Also read: ఆహారవ్యవహారాదులలో సంయమనం

ఇలా రామచంద్రుడికి కలిగినసందేహాలన్నింటికి వశిష్ఠ మహర్షి చెప్పిన సమాధానాలే యోగవాశిష్ఠము! అందులో మనస్సు గురించి మహర్షి అద్భుతంగా చెపుతారు ‘‘మనిషి యొక్క సంకల్పం నుండి పుట్టేదే మనస్సు!

మరి సంకల్పం అంటే ఏమిటి?

సంకల్పం ఒక భావన! ఒక ఆలోచన! సృష్టిలోనిది ఏదైనా సరే అది మనకు ఆనందం కలిగించేదయినా అయ్యుంటుంది! లేదా బాధ కలిగించేది అయినా అయి ఉంటుంది! ఆనందం కలిగించే ఆలోచన కలిగినప్పుడు, అది స్వంతం చేసుకోవాలని అని అనిపించి ఆ దిశగా ప్రయత్నం చేస్తాడు మనిషి! ఆలోచన బాధ కలిగించేది అయినప్పుడు దానికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు మనిషి!

Also read: మనకు మనమే శత్రువు

All human decisions are either pleasure driven or pain driven. We try to avoid pain!

మనిషికి డబ్బు సంపాదించడం, సుఖాలు పొందడమే ధ్యేయం అయినప్పుడు ఈ సంకల్పాలను ఎదగనివ్వాలి, అంటే మనస్సుకు ఈ వాసనలు బాగా అంటనివ్వాలి. అంతిమ సత్యం తెలుసుకోవాలి. నా ఉనికి ఏది? నేనెక్కడనుండి వచ్చాను? ఇవి తెలుసుకోవాలంటే ఆ వాసనలను నశింప చేసుకోవాలి అంటే సంకల్పాలను మొగ్గలోనే త్రుంచి వేయాలి.

Nip it in the bud itself!

‘‘సంకల్పప్రభవాన్‌ కామాంస్త్యక్త్వా సర్వానశేషతః

మనసైవేంద్రియగ్రామం వినియమ్యసమంతతః’’

సంకల్పము చేత కలిగే సమస్త విషయములు నిగ్రహించమంటున్నాడు పరమాత్మ, ఆ మనస్సుతోటే సకల ఇంద్రియవిషయాలనుండి నిగ్రహించమంటాడు ఆ పరంధాముడు.

‘‘వ్యక్తిత్వ వికాసం’’, ‘‘విజయం సాధించటం ఎలా’’? ఇలాంటి పుస్తకాలలో మనకు చెప్పేది ఈ సంకల్పాలను పెంచుకొమ్మని!

కానీ గీత మాత్రం!

అంతిమ సత్యం తెలుసుకోవాలంటే సంకల్పాలను త్రుంచుకొమ్మని చెపుతున్నది !

సంకల్పాలు పెంచుకుంటే…

‘‘మాయమై పోతున్నడమ్మో మనిషన్నవాడు’’… అని పాడుకోవాల్సి వస్తుంది!

సంకల్పాలు తుంచుకుంటే…

’’సర్వభూతస్తమాత్మానమ్‌ సర్వభూతానిచాత్మని’’ అని తెలుసుకుంటాడు మనిషి!

తనను అన్ని భూతములలో అన్ని భూతములను తనయందు చూసుకుంటాడు…

Also read: బ్రహ్మము తెలిస్తేనే బ్రహ్మర్షి

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles