Thursday, November 7, 2024

చెెవిటి భార్య

                        ————————-

(‘ SHE WHO WAS DEAF’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)

తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్

                       36. సంచారి తత్త్వాలు

                       ———————-

ఒకానొకప్పుడు ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి ఒక పడుచు భార్య ఉండేది. ఆమెకు బ్రహ్మ చెవుడు.

ఒక రోజు ప్రొద్దున,  వారు ఉపాహారం తీసుకునే సమయంలో ఆమె అతనితో ఇలా అంది. ” నిన్న నేను బజారుకు వెళ్ళాను. అక్కడ – డెమాస్కస్ నుండి పట్టు వస్త్రాలు, ఇండియా నుండి తల పాగాలు, పర్షియా నుండి నెక్లెసులు, ఇంకా యెమెన్ నుండి మణికట్టు గొలుసులు — తెచ్చి ప్రదర్శనకు పెట్టారు. యాత్రికులు ఇప్పుడే మన నగరానికి ఇవన్నీ తెచ్చినట్లున్నారు. నన్ను ఒక్కసారి చూడు. ఈ పాత గుడ్డల్లో ఎలా ఉన్నానో! పేరుకు మాత్రం పేద్ద ధనవంతుడి భార్యను!

 నేను పైన చెప్పిన అందమైన వస్తువులలో కొన్నిటిని కొంటాను. “

ఆమె భర్త ఇంకా కాఫీ తాగుతూనే ” డియర్! నీవు బజారు వెళ్లి నీ మనసుకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చుగా!” అన్నాడు.

ఆ చెవిటి భార్య ఇలా అంది ” వద్దా! నువ్వెప్పుడూ వద్దు–వద్దు అనే అంటావు. నేను ఈ చిరుగు బట్టలతో మన స్నేహితుల మధ్య తిరుగుతూ ఉంటే నీ సంపదకూ, మా వాళ్లకూ అవమానం కాదూ?”  

 భర్త అన్నాడు కదా!” నేను వద్దనలేదు. నువ్వు బజారుకు వెళ్లి, మన నగారానికి వచ్చిన అత్యంత అందమైన బట్టలూ, నగలూ– అన్నీ కొనుక్కోవచ్చు.”

కానీ మరలా , ఆ చెవిటి భార్య అతని మాటలు మరో రకంగా అర్థం చేసుకుంది. ఆమె ఇలా సమాధానమిచ్చింది.” డబ్బున్న వాళ్ళందరిలోను – నువ్వే పెద్ద లోభివి! అందంగా ఉండేది, ఇష్టపడేది ఏదైనా నాకు దక్కనీయవు. నా వయస్సున్న ఇతర స్త్రీలు మాత్రం విలువైన వస్త్రాలు ధరించి నగర తోటలలో తిరుగుతూ ఉంటారు”

అని ఆమె ఏడవటం మొదలెట్టింది. కన్నీళ్లు ఆమె గుండెలపై పడగానే మరలా ఏడిచింది. “నేను ఎప్పుడు నగ గానీ దుస్తులు కానీ కావాలనుకున్నా  ‘వద్దు–వద్దు’ అంటూనే ఉన్నావు.”

 అప్పుడు ఆ భర్త చలించి పోయి, నిలబడి తన పర్సులో నుంచి గుప్పెడు బంగారు నాణాలు తీసి ఆమె ముందు పెట్టి , మృదువైన గొంతుతో ఇలా అన్నాడు ” బజారుకు వెళ్లి నీకిష్టమైన వన్నీ కొనుక్కో!”

 ఆ రోజు నుండి, బధిరురాలైన ఆ యవ్వనవతి తమకేమి కావాలన్నా , తన భర్త దగ్గరకు వెళ్లి ముత్యాలలాంటి కన్నీళ్లు కార్చేది. ఆయన మౌనంగా చేతి నిండా బంగారు నాణేలు తీసి ఆమె ఒడిలో పోసేవాడు.

తరువాత ఆ బధిర యువతి ఒక యువకుడితో ప్రేమలో పడింది. అతనికి దీర్ఘ  ప్రయాణాలు చేయడం అలవాటు. అతను దూరమెళ్లినపుడల్లా, ఆ యువతి తన కిటికీలో కూర్చొని విలపించేది.

అమె భర్త ఆ యువతి విలపించడం చూసినపుడు మనసులో ఇలా అనుకునే వాడు.” నగరంలోకి కొత్త దుస్తులు, నగలతో సంత వచ్చినట్లుంది.”  ఆ భర్త అపుడు చేతి నిండా బంగారు నాణేలు తీసుకుని ఆమె ముందు ఉంచేవాడు.

Also read: ఒక దేవుడు మరియు చాలా మంది దేవుళ్ళు

Also read: ఆవాసాలు

Also read: దానిమ్మ పళ్ళు

Also read: శాపం

Also read: ఆనందము — దుఃఖము

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles