Sunday, December 22, 2024

నాకు మరేదారీ లేదు అంటేనే శరణాగతి

ద్రౌపదిని నిండుసభలో వస్త్రాపహరణం చేస్తూ ఉంటే పెద్దలు అందరూ తలవంచి ఉన్నారే గాని రక్షించినవారెవరూ లేరు. దుశ్శాసనుడి బలంతో ద్రౌపది ఆపలేకపోసే ప్రయత్నం చేసి సాధ్యం కాదని వదిలిస్తే, నీదే శరణు అనుకోక మరేదీ లేదు. అందుకే రక్షిస్తాడు కూడా. ఏ విధంగా రక్షణ లభించిందో తెలియదు. ఎవరూ చెప్పరు. ఇదొక గొప్ప మిస్టరీ మాత్రమే. శ్రీకృష్ణుడు అనుకోవలసిందే గాని, ఆయనే చేసినట్టు చెప్పడు. నీ భక్తి మాత్రమే, శరణు కోరుకోవడమే నీకు రక్షణ అవుతుందంటాడు.

నాకు మరేదారీ లేదు అనుకోవాలి. తల్లి పాలిస్తూ ఉంటే కొడుకు కొరికినా కోప్పడినా, కొట్టినా, ఏడుస్తూ ఒడినుంచి దింపినా, అమ్మా అమ్మా అని అనవలసిందే తప్ప మరేదారీ లేదు అనేదే శరణాగతి అని టిటిడి వక్త, గాయకుడు, ప్రవచన ప్రముఖుడు కె ఇ లక్ష్మీనరసింహన్ వివరించారు.

మేం కలిసి వచ్చి చేరాం

మేం కలిసి వచ్చి చేరాం అనే మాట చాలా గొప్పది. అర్థం చేసుకోవలసింది ఇది. నీళాదేవి అడిగారు మీరు ఏ విధంగా వచ్చి చేరారు? అంటే ఆమె శ్రీ లక్ష్మీ అనుమతి లేకుండా, భగవంతుడు కూడా రాలేడు కదా? ఆ 5 లక్షల మంది లక్ష్మీ, నీళాదేవి చేరినపుడు మీరు రాలేరా? పొద్దున్నే లేవగానే భగవంతుడు కూడా చూడాలని అనుకుంటాడట. కనుక మనమందరం చూడాలని అనుకోవాలి. ఒక అంధుడు తిరుపతికి వెళ్లదామంటాడు. ఏ విధంగా చూస్తావని మిత్రులు, మరి పెద్దలు అడుగుతారట. వారి జవాబు ఏమిటి ఊహించగలరా? నేను చూడడానికి కాదు. నాగురించి ఆ శ్రీవేంకటేశ్వరుడు చూడాలని అనుకుంటాను, ఇంక  వెంకన్న చూసిన తరువాత నాకు జీవితం ధన్యమే కదా అంటాడు. అందుకే గోపికలు, 12మంది భక్తులు, తమను చూడాలని భగవంతుడు అనుకుంటారట అందుకే వారికి సుప్రభాతం అని మేలుకొలుపే ఇవన్నీ.

సంపత్ ప్రేమించిన బీబీ

రామానుజుడు రమ్మంటే సంపత్ కుమార్ అంటే నారాయణుడే పిలిస్తే వచ్చినిలిచాడినాడే. కర్నాటక మేల్కోటే దేవాలయంలో ఉత్సవ విగ్రహమైన సంపత్ కుమారుడిని   ఢిల్లీ సుల్తాన్ తీసుకుపోయారు. అక్కడ సుల్తాన్ కూతురు సంపత్ కుమార్ ప్రేమించాడు. అంటే సంపత్ తోనే మాట్లాడేది, అలంకారం చేయించేది, వస్త్రాలు కుట్టించేది, నివేదన చేసేవాడు ఆ అమ్మాయి. రామానుజుడు విగ్రహాలను నాకు ఇవ్వండి అని సుల్తాన్ అడిగాడు. సరే నన్నాడు. అయితే దోచుకుని తెచ్చిన విగ్రహాలల్లో సంపత్ మూర్తి గారు లేరు అని రామానుజుడు ప్రశ్నించాడు. ఎక్కడుందా మాకు తెలియదు, మీ దేవుడు, మీకే తెలియాలి. అడగండి వస్తే తీసుకుపోమ్మండి అన్నాడు సుల్తాన్. రామానుజులు ఇదొక తీవ్రమైన పరీక్ష. ఏం చేయాలి అని బాధపడ్డారు. స్వామీ నీదే శరణు అన్నారు. సంపత్కుమారా ఇంగె వాడా శెల్వప్పెళ్లై (ఇక్కడికి రానాయనా ముద్దుబాబూ) అని పిలుచుకున్నాడు. సుల్తాన్ బీబీ ఆయన ఒడినుంచి బయలుదేరి సుల్తాన్ మహల్ కు చెంగ్ చెంగ్ అంటూ వచ్చి రామానుజుని రెండు చేతులతో అందుకున్నారు. కళ్లనీళ్లంతా నింపుకుంటూ రామానుజుడు కళ్లకద్దుకున్నాడు. బీబీ నాచ్చియార్ ప్రియుడైన పేరు సంపత్ అని కూడా తెలియదు. రామనుజులు తీసుకుపోతారని తెలిసి బీబీ బాధపడ్డారు. రామానుజుని వెంట నడిచి వెళ్లిపోయింది. ఆమె ప్రేమ తెలిసి రామానుజులు వివాహం చేయించారనీ, ఆమె ఆ సంపత్ కుమారుడినే లీలమయినారంటారు.  

గోదాదేవి వలె శ్రీరంగనాథుడితో బీబీ నాచ్చియార్ కూడా సంపత్ కుమారుడిని ఐక్యమైనారు. రామానుజుని పిలుపు విని సంపత్ కుమారుడై వచ్చి ఆయన ఎదురుగా నిలిచినాడంటే భగవంతుడికి ఇంకే రుజువు కావాలని రామానుజుడు నిరూపిస్తాడు. నీళాదేవి కూడా పిలిస్తే శ్రీకృష్ణుడు వస్తారు. 5 లక్షల మంది అడిగితే రాకుండా ఉంటాడా అంటారీ పాశురంలో.

మరేదారీ లేదు అనేదే శరణాగతి అని టిటిడి వక్త, కె ఇ లక్ష్మీనరసింహన్ అని జీయర్ స్వాములు ఇద్దరు నిర్వహించిన ధనుర్మాసం 22వ తిరుప్పావై పాశురంలో ప్రవచనం వివరిస్తున్నారు.

(శ్రీ కే ఇ లక్ష్మీనరసింహన్ ప్రసంగించిని చూసి వినవొచ్చు.Tiruppavai 22 Pashuram 6.1.2024, TTD.https://www.youtube.com/watch?v=Knw2dMLf6Vw)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles