దేశం పురోగతికి మూలం అధిక ఉత్పాదన
దానికి మూలం సాంకేతిక నైపుణ్యం
సాంకేతికతకు మూలం పరిశోధన
పరిశోధనకు మూలం శాస్త్ర అవగాహన
దానికి మూలం భాష
భాషకు మూలం పదాలు
పదాలు అప్రయత్నంగా వస్తాయి మాతృభాషలో
ఎంతనేర్చినా అమ్మభాషలో సులువు, నేర్పు కష్టం
పరాయి భాష ప్రయత్నం చేసి నేర్వాలి
పరభాషలో రావడం కష్టం
సృజనకు అమ్మభాష సాటిలేదు
పరభాష లోకవ్యవహారానికి చాలు
దానికోసం చదువంతా పరభాషలో
చదవ వలసిన అవసరం లేదు
అవసరమైనదానికంటే మోజుకొద్దీ
పరభాషను కౌగలించుకున్నాం
ప్రపంచమంతా నడిచే తీరుకు వ్యతిరేకంగా
వెనక్కి నడిచే ప్రయత్నం చేస్తున్నాం
అది కూడా ఎవరూ తోడు లేకుండా
Also read: వరం
Also read: జీవిత సత్యం
Also read: సహచరిత
Also read: చందమామ
Also read: అందం