- మంతనాలు జరుగుపుతున్న నేతలు
- బెదిరింపులకు పాల్పడుతున్న అధికార గణం
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలిరోజు నామినేషన్లు తక్కువగానే దాఖలయినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రతి పార్టీలోను ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని బరిలోకి దించాలని నిర్ణయించడం ఆయా పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీరందరిని సముదాయింది ఓటు బ్యాంకు సామాజిక వర్గం ఓట్లు, ఆర్థికంగా అండదండలున్న వ్యక్తిని ఎంపిక చేయడం తలకుమించిన భారంగా మారింది. ఒకవేళ అభ్యర్థిత్వం దక్కనివారు. ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అయి పొగబెడతారని భయం కూడా ఉంది. ఆశావహులను కూర్చోబెట్టి సమాలోచనలు చేస్తున్నారు. వారికి బుజ్జగించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ లేఖాస్త్రాలకు అధికార పార్టీ విరుగుడు మంత్రం
ఏకగ్రీవం కాదంటే ఆర్థిక మూలాలపై వేటు:
ఎన్నికల కమిషన్ హెచ్చరికలు చేస్తున్నా పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నయానో, భయానో బెదిరించి ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల బలహీనతలను గుర్తించి బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడుతూ ఎన్నికల బరిలో లేకుండా పక్కా స్కెచ్ వేస్తున్నారు. దీనికి తోడు అధికారం తోడవటంతో అడ్డులేకుండా పోతోంది. కొన్ని చోట్ల ప్రత్యర్తి అభ్యర్థులకు నగదు ఆశ చూపించి ఏకగ్రావాలకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఎరగా వేసి ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ఏవీ కుదరకపోతే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఎన్నికల బరినుంచి తప్పిస్తున్నారు. బెదిరింపులు ఫోన్లో కాకుండా ప్రత్యక్షంగా వెళ్లి బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్లో బెదరిస్తే వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నందున ముందుగానే జాగ్రత్తులు పడుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో రాజకీయాలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. నామినేషన్లు వేసేందుకు ప్రత్యర్థి నేతలు భయాందోళనలకు గురవుతున్నారు. చివరి క్షణం దాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఏకగ్రీవాలకు తావులేకుండా అన్నిచోట్లా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికార పార్టీకి ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం, ఎన్నికల సంఘం “ఢీ” అంటే “ఢీ”
ఏకగ్రీవాలపై ప్రత్యేక నిఘా:
మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకగ్రీవాలపై ఒత్తిళ్లకు గురిచేసేవారిపై నిఘా పెట్టేలా షాడో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో షాడో బృందాలను పెంచి ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ఏకగ్రీవాలను దురుద్దేశంతో చూడలేమన్న నిమ్మగడ్డ బలవంతపు ఏకగ్రీవాలపై రాజకీయ పార్టీలనుంచి ఫిర్యాదులు అందితే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై కడప జిల్లాలో నిమ్మగడ్డ ఈ రోజు (జనవరి 30) పర్యటిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై “పంచాయితీ”