————————-
(‘ SHADOW’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం:డా. సి.బి.చంద్ర మోహన్
42. సంచారి తత్త్వాలు
————
జూన్ నెలలో ఒక రోజు గడ్డి, ఎల్మ్ చెట్టు నీడతో ఇలా అంది. ” నువ్వు కుడివైపు, ఎడమవైపు ఎక్కువగా కదులుతూ, నా ప్రశాంతతను భంగ పరుస్తున్నావు.”
నీడ ఇలా చెప్పింది. ” నేను కాదు. నేను కాదు! ఆకాశం వైపు చూడు. భూమికి, సూర్యుడికి మధ్య గాలిలో తూర్పుకు, పడమరకు కదిలే చెట్టు ఉంది.”
గడ్డి మొక్క తల పైకెత్తి మొదటిసారిగా ఆ చెట్టుని చూసింది. అది తన మనస్సులో ఇలా అనుకుంది.
“గమనించుకో! నాకన్నా పెద్ద గడ్డి మొక్క ఉంది.”
తరువాత గడ్డి మొక్క నిశ్శబ్దంగా ఉంది.
Also read: శాంతి ఒక అంటు వ్యాధి
Also read: మంచి — చెడు
Also read: కాలం
Also read: తిమింగలము — సీతాకోకచిలుక
Also read: మార్గము