- 5743 ఓట్లతో సెనేట్ లో వీగిన అభిశంసన తీర్మానం
- తీర్మానం ఓడినా అభియోగం నిలుస్తుంది : ప్రెసిడెంట్ బైడెన్
- సెనేటర్లు పిరికిపందల్లా వ్యవహరించారు : నాన్సీ పెలోసి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ముప్పు నుంచి తప్పించుకొని గట్టెక్కారు. ఎలక్టొరల్ కొలేజి ఫలితాలను ధ్రువీకరించేందుకు సెనేట్ సమావేశమైన జనవరి 6వ తేదీన కేపిటల్ హిల్ పైన తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారనే అభియోగంపైన అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించి సేనేట్ కు పింపింది. పోయినవారం అభిశంసన తీర్మానంపైన చర్చ ప్రారంభించిన సెనేట్ శనివారంనాడు తీర్మానానికి వ్యతిరేకంగా 57-43 ఓట్లతో నిర్ణయించింది. అభిశంసన తీర్మానం ఆమోదించి, ట్రంప్ కు శిక్ష పడాలంటే 67 ఓట్లు అవసరం. ట్రంప్ అభిశంసనకు 2020లో మొదటి ప్రయత్నం జరిగింది. ఈ సారి విచారణ తక్కువ వ్యవధిలోనే ముగిసింది. కేపిటల్ హిల్ పైన ట్రంప్ మద్దతుదారుల దాడికి సంబంధించిన దృశ్యాలను (విజువల్ ఫుటేజీని) చూడటం, ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వినడానికే పరిమితమైన ఈ ట్రయల్ తక్కువ వ్యవధిలోనే ముగిసింది.
Also Read : ఊపిరి పీల్చుకున్న అమెరికా
బైడెన్ వ్యాఖ్య
కేపిటల్ హిల్ పైన దాడి జరుగుతున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారనీ, దాడికి ప్రోత్పహించినట్టుగా భావించడం సరికాదనీ, మొదటి రాజ్యాంగ సవరణ ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం ట్రంప్ చేసింది నేరం కాదన్నది డిఫెన్స్ వాదన. ‘‘చివరి ఓటింగ్ ట్రంప్ ను దోషిగా నిర్ధారించకపోయినప్పటికీ ఆరోపణల సారాంశంపైన వివాదం లేదు’’ అంటూ ఓటింగ్ ముగిసన తర్వాత శనివారం సాయంత్రం ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యానించారు. ట్రయల్ జరుగుతున్న రోజుల్లో ప్రెసిడెంట్ బైడెన్ మౌనంగా ఉన్నారు. ‘ప్రజాస్వామ్యం దుర్బలంగా ఉన్నదనీ, దానిని ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉండాలనీ ఈ విచారకరమైన ఉదంతం గుర్తు చేస్తున్నది’ అని ఆయన అన్నారు.
పనిగట్టుకొని వెంటాడారు : ట్రంప్
ఇది దేశ చరిత్రలో పనిగట్టుకొని ఒకరిని నేరస్థుడిగా నిర్ణయించేందుకు జరిగిన ప్రయత్నమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఇటువంటి వ్యవహారం లోగడ ఏ అధ్యక్షుడి విషయంలోనూ జరిగి ఉండదు,’ అంటూ ప్రకటన జారీ చేశారు. అమెరికా గొప్పదనాన్ని ఈ దేశ ప్రజలందరికీ నిరూపించేందుకు మన ఉద్వేగమైన కార్యక్రమాలను కొనసాగిద్దాం. రానున్న రోజులలో మీతో చాలా విషయాలు పంచుకుంటాను. ఇటువంటి గతంలో ఎన్నడూ లేదు’ అని అన్నారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మాత్రం ట్రంప్ ను విడిచిపెట్టిన సెనేటర్లను పిరికిపందలు అంటూ అభివర్ణించారు.
Also Read : శైలారోహణ– అమండా గోర్‌మన్