భగవద్గీత-91
‘‘మనసు‘గతి’ ఇంతే – మనిషి బ్రతుకింతే!’’ సైన్సు అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా మూఢనమ్మకాలు ఏమిటనే ప్రశ్న దాదాపు అందరూ విన్నదే. సైన్సు ఎక్కడ అభివృద్ధి పొందిందని ప్రశ్నిస్తే… ఇంద్రియ విషయాలను మనిషికి చేరువచేసే క్రమంలో ముందడుగు వేసిందని మాత్రమే చెప్పవచ్చు.
Also read: భగవద్గీత అర్థమవుతే జీవితం అర్థం అవుతుంది
దూరాలు వెళ్ళటానికి నింగి, నేల, నీరు వీటిమీద సాధనాలు తయారు చేసుకున్నాడు. శరీరాన్ని కష్టపెట్టకుండా పరికరాలు తయారు చేసుకున్నాడు. దూరంగాఉన్న మనిషితో చూస్తూ సంభాషించడానికి పరికరాలు కనుక్కున్నాడు. (ఇంకా స్పర్శిస్తూ సంభాషించేది కనుక్కోలేదు) అంతరిక్షంలోకి దూసుకుపోతాను అంటాడు కానీ Hubble Volume దాటిపోలేడు. ఇవ్వన్నీ శరీరానికి సంబంధించినవే.
మనిషి అంటే శరీరమేనా? మనిషి అంటే శరీరము, మనస్సు, చైతన్యము. కేవలము శరీరమునకు సంబంధించిన ప్రగతి సాధించి, మనస్సుకు సంబంధించిన విషయం గురించి వాదిస్తారెందుకు?
Also read: భగవంతుడు సర్వాంతర్యామి
జ్ఞానము అంటే matter గురించి మనిషి కనుక్కున్నది కాదు. తెలుసుకున్న విషయాలను సైన్సు పేరుతో పిలుస్తున్నాము.
నమ్మకం అనేది ఒక భావన. అది మనస్సుకు సంబంధించినది. మనస్సుకు సంబంధించి మన ప్రగతి ఏది? ప్రగతి మాట అటుంచి అధోగతిపాలవుతున్నాం.
మూఢనమ్మకాలు ప్రబలక ఏమవుతాయి? మన మనస్సు మన అధీనంలో లేదు. అసలది అర్ధమే కానప్పుడు అధీనంలోకి ఎట్లా వస్తుంది? మనస్సు అదుపుతప్పి, శరీరసుఖాలకు అలవాటు పడి, సహజ జీవితాన్ని కోల్పోయినవాడే ఆధునిక మానవుడు.
మనిషిలో విశాల దృక్పథం ఏర్పడాలంటే ఉపనిషత్తులను, భగవద్గీతను ఆశ్రయించాల్సిందే!
॥జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః
తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్॥
“ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపుకున్నవాళ్ళు, సూర్యుడికాంతి లాంటి తమ జ్ఞానంతో పరబ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకుంటారు.
Also read: శ్రద్ధాభక్తులు లేని కార్యం నిష్ప్రయోజనం