• స్వీయ భరోసా ఉన్న వారికే ఉద్యోగ పట్టా
• వ్యక్తిగత భద్రతకు ప్రతి మహిళ పోలీసులా వ్యవహరించాలి
ఆధునిక ప్రపంచములో చదువు, డిగ్రీ కన్నా వ్యక్తిగత చురుకుదనం, మెప్పించగల సామర్థ్యం ఉన్న వారికే కార్పొరేట్ వ్యవస్థ పట్టం కడుతోంది. విద్యార్హత అనేది ఫైల్ కోసమే తప్పా పది మందిని ఒప్పించి, బిజినెస్, లేదా కంపెనీ పురోభివృద్ధికి పాటు పడే వారికే ఇంటర్వ్యూలో ఉద్యోగం వరిస్తోంది.
స్వీయ అవగాహన
ఒక అభ్యర్థి స్వీయ నియంత్రణ, ప్రేరణ, ఎదుటి వ్యక్తిని ఒప్పించగల నేర్పరితనం, సామాజిక నైపుణ్యాలు ఉన్న వారు టీం లీడర్లు గా ఎదగగలుగుతున్నారు. ఒక గృహిణి అయినా, ఒక రాజకీయ నాయకురాలైనా ఆత్మ విశ్వాసం ఆమె ఆయుధం అయినప్పుడు ఎదుటి వారు చెప్పినట్టు వింటారు. అలాంటి వారు ముందు ప్రతిఘటన ఎదుర్కొన్నా, తరువాత ఎదుటి వారు అసూయ పడేలా ప్రతిభ చూపగలువుతారు. ఆత్మవిశ్వాసం తనలో ఉండడం కాదు ఎదుటి వ్యక్తిలో తన పట్కల విశ్వొసం కలిగించినప్పుడే మంచి లీడర్ లక్షణాలు ఉన్నట్టు. నిజంగా పదిమందిలో “సూపర్ పవర్” గా నిలవాలంటే కొన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలి.
Also Read: మానవ జీవితమే ఒక సముద్ర ఘోష!
లౌక్యం, మెళకువ
అదే మాట సామర్థ్యం, మనసు నొప్పించుకుండా తన దారికి తెచ్చుకునే లౌక్యం, పని తీసుకునే మేళకువలు ఉన్నవారే ఇవ్వాళ్ళ కార్పొరేట్ రంగాన్ని శాసించగలుగుతున్నారు. అడుగడుగునా మీ ఆత్మ విశ్వాసానికి అడ్డుపడే శక్తులు ఉంటాయి. అవే మీ పెరుగుదలకు కొత్త ఆలోచనలు సృష్టిస్తాయి!మిమ్మల్ని మీరు విశ్వసించుకుని, మీ నమ్మకాన్ని ఎదుటి వ్యక్తిలో కల్పించి, నవ్వుతూ, నవ్విస్తూ పనిని చక్కదిద్దే ప్రతిభావంతమైన చాతుర్యం మీరు చూపిస్తే చాలు మీకు కంపెనీలో పదోన్నతి వచ్చి నట్టే! ఆత్మ విశ్వాసం అంటే ముందుగా మీ లోని లోపాలను తెలుసుకొని ఎదుటి వారి కనుగుణంగా మాట్లాడి వారి లోపాలను వెతికి సరిదద్దగలిగే నేర్పరి తనం మీకు రావాలి! స్వీయ సమర్థత లోపం, అభద్రత భావం ఉంటే లీడర్ గా ఎదగగలేరు!
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం
ఆత్మ గౌరవం ఉండాలి… అందులో నుండి విశ్వాసం ఉద్భవించేలా శ్రమ మీకు సొంతమయినప్పుడే మీ బాస్ లు మీకు గురుతరమైన బాధ్యతలు అప్పగిస్తారు. మీలో అద్భుత విషయ పరిజ్ఞానం ఉన్నా మీరు స్పీకర్ గా మీ భావాలు వ్యక్తం చేసే సామర్థ్యం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే.కోపం లేకుండా, భయపడకుండా, ఇబ్బందికర స్థితిని తెచ్చు కోకుండా, ఆప్యాయంగా, విషయం అర్థమయ్యేట్టు, ఎప్పుడు అప్రమత్తంగా, విస్మయం కలిగేలా, అందరిని ఆశ్చర్య పరిచేలా, సమగ్రమైన సబ్జెక్టు మీకు సొంతం అయినప్పుడు టీం లీడర్లుగా అవతరిస్తారు.
సమాజం పట్ల అవగాహన
అలాంటి విషయ పరిజ్ఞానం ఒక పుస్తకాలతో రాదు..సమాజం పట్ల అవగాహన అవసరం! దానికి కొంత మంది గృహిణులు చేసే సాహస కృత్యాలు కూడా మోటివేషన్ క్లాసులో తెలుసుకుంటాం. భార్య, భర్తల డ్యూటీలు వేరు. ఉదయం భార్య డ్యూటీ అయితే రాత్రి భర్త డ్యూటీ! ఇద్దరి సంపాదనతో ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొన్నారు. రాత్రి అంత పెద్ద ఇంట్లో ఒక్కతే భార్య ఉంటే ఆమెకు ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం. భర్త ఎన్ని సి.సి కెమెరాలు పెట్టించినా, వచ్చే దొంగకి అవో లెక్క కావు. అలాంటపుడు ఆ భార్య ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది…జాగ్రత్తలు… బెడ్ తలగడ క్రింద ఇరుగు పొరుగు వారి ఫోన్ నెంబర్లు, పోలీస్ స్టేషన్ నెంబర్ గస్తీ తిరిగే వాచ్ మెన్ ఫోన్ నెంబర్, సిద్ధం చేసుకోవడమే గాక ఇంట్లో ఉండే శునకం ఆమెకు కాపలాగా బయట వదిలేస్తే, కుక్కను మత్తు మందు ఇచ్చి తుదముట్టించే కిరాతకులు ఉంటారు కాబట్టి… తన బెడ్ రూమ్ లోనే ఒక వైపు దాన్ని కట్టేసి… ఆత్మ రక్షణకు ఉపయోగ పడే చిన్న కత్తులు, కాటర్లు వంటివి అందు బాటులో ఉంచుకొని అప్రమత్తమయ్యే ఒంటరి మహిళలకు, అనుకున్నట్టే దొంగలు ఆ ఇంటి గేటు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు…వెంటనే సిసి కెమెరాల్లో ఆ దృశ్యాలను చూసిన ఆ ఇల్లాలు, ముందు గట్టిగా అరవకుండా తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లతో పాటు భర్తను అప్రమత్తం చేసి, అందరికి ఫోన్ చేసి ఇంటి చుట్టురా మోహరించేలా ప్లాన్ చేసి… లోపలి వరకు దొంగలు చేరేసరికి… అప్పుడే బెడ్ రూమ్ లో ఉన్న శునకాన్ని వదిలి మరో వైపు మారణాయుధాలతో సిద్ధంగా ఉంచుకున్న ఆమె ఆత్మ విశ్వాసం తో …దొంగలు కొంపాండ్ దూకే లోపే బంధీలు అయ్యారు.
Also Read: అహంకారం ఒక అంధకారం… అదే పతనానికి హేతువు
సాహసోపేతమైన మహిళ
సహసోపేతమైన ఆమె నిర్ణయంతో దొంగలను పట్టించిన ఆ ఇల్లాలుకు పోలీసు అధికారులు సుకన్య అవార్డుతో సత్కరించారు… అలా ఉండాలి ఆత్మ విశ్వాసం అంటే! ఇలాంటి మోటివేషన్ క్లాస్ లే కాకుండా ఒకరి మెచ్చుకోలు కోసం కాకుండా స్వీయశక్తితో తన ఇంటిని చక్కదిద్దుకునే గృహిణి కూడా ఆ ఇంటి టీం లీడరే. ఎదుటి వ్యక్తి చూడగానే గౌరవ ప్రదమైన భావన ఉండేలా వస్త్ర ధారణ ఉండాలి…చురుకుదనం వంట్లో కంట్లో ఉండాలి… ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం ఉండాలి, ఆడవాళ్లు అయితే అసభ్యకరమైన దుస్తులు ధరించుకుండా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరిస్తే చేతులెత్తి నమస్కారం పెట్టేలా ఉండాలి.
సుత్తి కొట్టకూడదు
మంచి ఉపన్యాస ధోరణి తో పాటు ఉపన్యాసాలు వినాలి… అలాగే తన కొలీగ్స్ చేసే పనులు తప్పయినా, విసుక్కోకుండా సర్ది చెప్పాలి, వేదికపై “టైమ్ బౌండ్” ఉపన్యాసం ఇవ్వాలి..సుత్తి చెప్పకుండా సూటిగా మెదల్లోకి ఎక్కేలా ఉపన్యాసం ఉండాలి…ఇవన్నీ ఎదుటి వ్యక్తి ప్రభావితుడు అయ్యి ఆత్మ విశ్వాసం పెంపొందించేలా ఉండాలి. స్వల్ప కాలిక ఆనందం కోసం బాస్ ను ఇంప్రెస్స్ చేయడం వల్ల ఫలితం రాదు… దీర్ఘ కాలిక ఆలోచనలు ఉండాలి…మాటలో గంభీర్యత తో పాటు ఎదుటి వారు చెప్పింది వినాలి… అప్పుడు మీ ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నాక మీకు “గుడ్ నేచర్” అనే బిరుదు వస్తుంది.
ఓర్వలేని శక్తులు ఉంటాయి
ఇక మీ అభ్యున్నతి చూసి ఓర్వలేని శక్తులు మీకు వ్యతిరేకంగా పని చేస్తుంటారు…మీ బలహీనతలు దొరక్క పోతే మిమ్మలి పొగరు బోతు అమ్మాయి/ అబ్బాయి గా పోల్చుతారు..అక్కడ మీరు సమన్వయం పాటిస్తే మీ బాస్ తో మీ వ్యవహార శైలిని గోరంతలు కొండంతలు చేసే శూర్పణకలు, మారీచులు ఉంటారు… అందుకే మీలో అవతలి వ్యక్తుల టాలెంట్ ను గుర్తించాలి..వైఫల్యాలు ఉన్న వారిని సర్ది చెప్పినప్పుడు కంపెనీలు బ్రహ్మ రథం పడతాయి!
Also Read: ఆడపడుచుల పుట్టింటి మమ ‘కారం’ !