Sunday, December 22, 2024

గోదావరిఖనిలో అక్రమ బొగ్గునిల్వల స్వాధీనం

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిధిలో ఉన్న జిఎల్కే బ్రిక్స్ కంపెనీకి చెందిన ఇటుక బట్టిలో అనుమతులు లేకుండా అక్రమంగా బొగ్గు నిల్వలు ఉంచారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రాజ్ కుమార్ ఇటుక బట్టీలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అక్రమంగా నిల్వచేసిన 8 టన్నుల బొగ్గు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో స్వాధీనం చేసుకున్న బొగ్గు విలువ 40 వేల రూపాయల ఉంటుందని అంచనా. ఇటుక బట్టి యజమాని సంతుపూరి సతీష్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం గోదావరిఖని టు టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles