భారత శిక్షాస్మృతి 1860 లోని 45వ చట్టం, 06-10-1860 [the Indian Penal Code Act no. 45 of 1860, 6th October, 1860.]
భారత శిక్షా స్మృతిని బ్రిటిష్ పాలకులు ఇండియాలో మొదటి లా కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన థామస్ మెకాలే 1837లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను తయారు చేశారు. అందులో సెక్షన్ 133 కింద “దేశద్రోహం” అనే నిబంధనను చేర్చారు. 1863 – 1870 మధ్య కాలంలో సెక్షన్ 133గా ఉన్న దేశద్రోహం నిబంధనను 1870లో ఐపీసీలో సెక్షన్ 124-ఏ గా మారుస్తూ చేర్చారు.
124 – ఏ అంటే ఏమిటి: చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలతో కానీ లేదా రాతలతో కానీ లేదా సైగలతో కానీ, దృశ్య మాధ్యమం ద్వారా గానీ ప్రజల్లో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రగిల్చినా, అందుకు ప్రయత్నించిన వ్యక్తులకు గరిష్ఠంగా యావజ్జీవ ఖైదుతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించవచ్చు లేదా కేవలం జరిమానాతో వదిలేయవచ్చు – అని ఈ నిబంధన (సెక్షన్) తెలియచేస్తుంది.
124-ఏ నిబంధన పౌరుల స్వేచ్ఛను, మానవ హక్కులను హరిస్తుంది అని కొన్ని దశాబ్దాల నుండి పౌర సమాజంలోని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, హక్కుల ఉద్యమకారులు 124-ఏ ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరియు 124-ఏ ను తీసివేయాలని భారత్ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ లను వేసారు,
కాలం చెల్లిన చట్టాలు ఎందుకు?
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వచ్చినా ఇంకా కాలం చెల్లిన చట్టాలతో ప్రజలను బాధించడం రాజ్యాంగానికి విఘాతం అని హక్కుల ఉద్యమకారులు ప్రభుత్వాల దృష్టికి తీసుక వెళ్లారు. ప్రజలకు విఘాతం కలిగించే చట్టాలను రద్దు చేయాలనీ, పౌర హక్కులకు ఆటంకం కలుగుతున్నదనీ ఆందోళన చెందారు. దేశద్రోహం అనే సెక్షన్ దుర్వినియోగం ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశద్రోహం నిబంధనను / సెక్షన్ సవాల్ చేస్తూ రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఎస్.జి.వాంబాత్కరే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)లో దేశద్రోహం సెక్షన్ 124-ఏ ఇప్పటికీ అమలు జరగటానికి కేధార్ నాథ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రధానమైనదని ఆ పిటిషన్ లో చెప్పారు. 60 ఏళ్ళ కిందటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆ తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ కోరారు.
భారత్ సర్వోన్నత న్యాయస్థానం 11-05-2022 న రాజద్రోహం సెక్షన్ కింద కేసులు నమోదుచేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులను అణచివేయడానికి బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యనించారు. దేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు దాటిందని, ఈ సెక్షన్ ఇంకా అవసరమా అని సూటిగా ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం అడిగింది. దేశ ద్రోహం సెక్షన్ బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టంలోనిది అన్నారు. రాజద్రోహం సెక్షన్ 124 -ఏ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. ఈ సెక్షన్ అమలు ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు వాడుతున్నారు. ఈ వాడుతున్న పద్దతితో వ్యవస్థలు, వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వినియోగం గురించి మీరెందుకు ఆలోచించడం లేదు.. రాజద్రోహం సెక్షన్ విషయంలో కేంద్రం పునరాలోచించాలని అన్నారు. సెక్షన్ 124-ఏ కింది కేసులన్నీతిని ఒకేసారి విచారిస్తాం అని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
స్వాతంత్ర్య సమర యోధులపై ప్రయోగించిన చట్టం
గాంధీ, తిలక్‌లపై స్వాతంత్య్రం అడిగినందుకు దేశద్రోహం సెక్షన్ ను బ్రిటిష్ వారు పెట్టారు. రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? ఎన్ని నిలబడుతున్నాయి? పేకాట ఆడేవారిపైనా సెక్షన్ 124-ఏ కింద కేసులు పెడుతున్నారు. బెయిల్ రాకుండా కక్షసాధింపు చర్యలకు పాలు పడుతున్నారు. అధికారదాహంతో కక్షసాధింపులకూ పాల్పడుతున్నారు. ఇంతే కాకుండా వ్యవస్థలను, వ్యక్తులను బెదిరించేస్థాయికి పోతున్నారు. ఫ్యాక్షనిస్టులూ ప్రత్యర్థులపై రాజద్రోహం సెక్షన్ మోపేలా వ్యవహరిస్తున్నారు, ఈ సెక్షన్ ప్రయోజనం కన్నా దుర్వినియోగమే ఎక్కువగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సెక్షన్ ని పున:సమీక్ష చేస్తామని కేంద్ర హోంశాఖ చెప్పిన నేపథ్యంలో, పునః సమీక్ష పూర్తయ్యేదాకా ఈ సెక్షన్ అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం పునః సమీక్ష పూర్తి అయ్యే వరకు రాజద్రోహం సెక్షన్ కింద కొత్త కేసులు నమోదు చేయరాదని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటిదాకా రాజద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు బెయిళ్ల కోసం ఆయా కోర్టులను ఆశ్రయించవచ్చనీ ధర్మాసనం పేర్కొంది.
పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం: బ్రిటిష్ వలస పాలకుల నాటి రాజద్రోహం (ఐపీసీ సెక్షన్ 124(ఏ) సెక్షన్ గురించి భారత్ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించకపోవటం చాలా శోచనీయం. రాజద్రోహ సెక్షన్ 124-ఏ రద్దుపై 2018లో లా కమిషన్ కీలక సిఫార్సు చేసింది. రాజద్రోహం సెక్షన్ న్ను పునఃపరిశీలించి, ఉపసంహరించాలని కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఈ సెక్షన్ ని రద్దు చేస్తే భారత ప్రజాస్వామ్యానికి క్షేమకరమని పునరుద్ఘాటించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఒక వ్యక్తి బాధ్యతా రహితపు వ్యాఖ్యలు చేస్తే వాటిని దేశ ద్రోహంగా పరిగణించడం సరికాదని లా కమిషన్ అప్పుడే అభిప్రాయపడింది. లా కమిషన్ చెప్పినప్పటికినీ ప్రభుత్వం ఎందుకు పెడచెవి పెట్టింది? ప్రభుత్వం దగ్గెర సమయం లేకనా ? లేక దేశం పై అలసత్వమా ? లేక దేశ పౌరులంటే నిర్లక్ష్య ధోరణినా?
భారత శిక్షాస్మృతినే సమీక్షించాలి
1860 నాటి భారత శిక్షాస్మృతి 45వ చట్టంనే మొత్తం సమీక్ష చేయవలసిన అవసరం ఉంది. భారతదేశానికి కావలసిన చట్టం ఎలా ఉండాలి అని చర్చ జరగాలి. ఒక్క 124-ఏ సెక్షన్ ఒక్కదాన్ని మాత్రమే సమీక్షిస్తే అసంపూర్తి సమీక్షగానే మిగిలిపోతుంది. ఈ దేశపౌరులకు, ఈ దేశ సార్వభౌమత్వానికి, లౌకికతత్వానికి, ప్రజాస్వామ్యానికి ఎలాంటి చట్టాలు కావాలి అనేది నేడు ప్రధానమైన అంశం. ఎందుకంటె ఇప్పుడున్న కీలకమైన చట్టాలు Cr.P.C (క్రిమినల్ ప్రక్రియా స్మృతి -1973), Evidence Act (భారత సాక్ష్య చట్టం – 1872 లో 1 వ చట్టం)-1872 , స్వాతంత్య్రం రాకముందు ఏర్పాటు చేసిన చట్టాలే. ఈ మూడు సమీక్షా చేయవలసి ఉన్నది. పునః సమీక్ష ఒకవేళ జరిగినట్లయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ఆక్ట్, నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్, అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్, రాష్ట్రాల పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ లు, ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్ ల అవసరం దేశానికి ఉండదు. 2019 లో కేంద్ర ప్రభుత్వం 58 చట్టాలను రద్దు చేసింది. భారత దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచే పేరుతో 29 కార్మిక చట్టాలను 4 ప్రధాన కార్మిక చట్టాలుగా రూపొందించింది. మరి వీటి విషయంలో ఎందుకు ఆలోచించటం లేదు?
భారత రాజ్యాంగాన్ని సులభతరంగా అమలు జరగకుండా చూస్తున్న స్వాతంత్య్రం కు ముందు తెచ్చిన చట్టాల విషయంలో ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించలేదు. వాటిని ఇటు తిప్పి అటు తిప్పి ఆ చట్టాలనే వాడటం .. ప్రభుత్వాల పని నాణ్యతా లోపంగా అనవచ్చా? ఎందుకంటె దేశ సంపదను ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయి .. జైళ్లల్లో జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, మేధావులను బంధించి పెట్టుకొని. విదేశీ వలసపాలకుల కాలం నాటి చట్టాలను ఇంకా ప్రభుత్వాలు మోసుకుంటూ 2022 వరకు వచ్చాయి అంటే ఆలోచించవలసిన అంశం. అప్పుడు వున్నా చట్టాలు భారత దేశానికి స్వాతంత్య్రానికి ముందువి, బ్రిటిష్ వలస పాలకులకు అనుగుణంగా ఏర్పాటుచేసుకున్న చట్టాలు అవి. ప్రస్తుతం భారత రాజ్యాంగంను దృష్టిలో పెట్టుకొని, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉండకుండా చట్టాలు ఏర్పాటు కావాలి.
అవమానకరమైన చట్టాల అవసరం ఉండదు
124-ఏ సెక్షన్ తో పాటు Cr.P.C (క్రిమినల్ ప్రక్రియా స్మృతి -1973), Evidence Act (భారత సాక్ష్య చట్టం – 1872 లో 1 వ చట్టం)-1872 పునః సమీక్షిస్తే, దేశాన్ని అంతర్జాతీయంగా అవమానపరుస్తున్న “ప్రివెంటివ్ డిటెన్షన్ ఆక్ట్, నేషనల్ సెక్యూరిటీ ఆక్ట్, అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్, రాష్ట్రాల పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ లు, ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్” ల తో ప్రభుత్వాలకు అవసరం ఉండదు.
భారత్ సర్వోన్నత న్యాయస్థానం 124-ఏ ఐపిసి ను పునః సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్నీ ఆదేశించటం కీలకపరిణామం అని మేం భావిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంయొక్క విజయం మరియు భారత్ న్యాయవ్యవస్థ యొక్క కీర్తి నలుమూలల పాకింది. ప్రజలలో న్యాయవ్యవస్థ పై అపారమైన నమ్మకాన్ని మరో సారి పెంచింది. 124-ఏ ఐపీసీ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
జయ వింధ్యాల, రాష్ట్ర ఇక్బాల్ ఖాన్
ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఉపాధ్యక్షులు
పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం
9440430263 / 9494869731