సింగరేణిలో డిస్మిస్ కార్మికుల సమస్యలను వినతిపత్రం ద్వారా స్వీకరించడానికి అధికారుల వద్ద టైం లేదు. వేలాది రోజులుగా తమకు న్యాయం చేయాలని కోరుతూ మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం సమీపంలోని నాగపూర్ – హైదరాబాద్ జాతీయ రహదారి ప్రక్కన నిరాహారదీక్ష చేస్తున్న డిస్మిస్డ్ కార్మికులు శుక్రవారం ప్రదర్శనగా జిఎం కు వినతి పత్రాన్ని ఇవ్వడానికి రాగా అధికారులు ఎవ్వరు కూడా వారిని కలవడానికి అనుమతి ఇవ్వక పోగా సెక్యురిటి గార్డ్ కు వినతిపత్రం ఇచ్చి పోమన్నారు.
Also Read : హుందాగా సాగని ప్రచారం
దీనితో డిస్మిస్డ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రవీందర్ తదితరులు సెక్యూరిటీ గార్డ్ కు వినతిపత్రం అందజేశారు. బేషరతుగా డిస్మిస్డ్ కార్మికులకు ఉపాధి కల్పించాలని… చనిపోయిన వారి కుటుంబాలకు పెన్షన్.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ, ఉచిత వైద్య సేవలు అందించాలనీ, న్యాయం చేయాలనీ డిస్మిస్డ్ కార్మికులు కోరుతున్నారు.
Also Read : నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం