- అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నిమ్మగడ్డ
- ఏపీ పోలీసులకు సెలవులు రద్దు
- ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ నజర్
పల్లె పోరుకు గ్రామాలు సిద్ధమవుతున్నాయి. కొన్నాళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధత వీడిపోవడంతో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమయింది. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల ఎంపికపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆశావహులు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అదేసమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నమూ లేదు. అన్ని వర్గాల కుల సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.రాష్ట్ర విభజన జరిగాక తొలిసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అన్ని సామాజిక వర్గాలను కలుపుకు పోయేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రిజర్వేషన్లను బట్టి ఆయా పంచాయతీలలో ఆర్థికంగా అండ దండలు ఉన్న నాయకులను ఎంపిక చేస్తున్నారు.
ఇదీ చదవండి: గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ
ఎన్నికల భద్రతా పర్యవేక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్:
పంచాయతీ ఎన్నికల్లో పర్యవేక్షణ బాధ్యతను ఐజీ సంజయ్ కు అప్పగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా పరిశీలించేందుకు సంజయ్ ను నియమించారు. ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో బలవంతపు ఏకగ్రీవాలపై దృష్టిపెట్టాలని ఎసీఈసీ సూచించారు. ఎస్ఈసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఐజీ సంజయ్ క్షేత్ర స్థాయిలో భద్రతాపరంగా ఎదురయ్యే సవాళ్లు, ఎన్నికల పర్యవేక్షణ చేయనున్నారు. అభ్యర్థులపై బెదిరింపులు, దాడులను అడ్డుకోవడంతోపాటు వారికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశించారు. గత సంవత్సరం మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో చిత్తూరు, పల్నాడు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్ఈసీ పోలీసులను ఆదేశించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవాలు కోరుకుంటే స్వాగతించాని అదే సమయంలో బలవంత పెడితే మాత్రం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ఉద్యోగ సంఘాల నేతలతో ఆదిత్యనాథ్ దాస్ భేటి
వారాంతపు సెలవుల రద్దు:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలోని అన్ని విభాగాల సిబ్బందికి సాధారణ, వారాంతపు సెలవులు రద్దు చేస్తున్నట్లు శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం (జనవరి 27) నుంచి ఫిబ్రవరి 21 వరకు సెలవుల రద్దు అమల్లో ఉంటుందని తెలిపారు. నాలుగు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఆరోగ్య రీత్యా అత్యవసర పరిస్థితుల్లో వారాంతపు సెలవును పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు
ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై ప్రతిపక్షాల భిన్నస్వరాలు