• ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై నిమ్మగడ్డ కసరత్తు
• ఎన్నికలు, వ్యాక్సినేషన్ పై వీడియో కాన్ఫరెన్స్
• హాజరుకానున్న సీఎస్, ఉన్నతాధికారులు
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పు నేపథ్యంలో వీరిద్దరి భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లను గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. ఎన్నికల్లో పూర్తి స్థాయి సహకారం అందిలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఆదేశించాలని నిమ్మగడ్డ కోరారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే
ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈ రోజు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేవ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు,జిల్లా పంచాయతీ అధికారులు, వైద్యా ఆరోగ్య శాఖ కమిషనర్లు సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 29 నుంచి తొలిదశ నామినేషన్ పత్రాల దాఖలు కోసం ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు. కొవిడ్ నేపథ్యంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బదిలీలు ఆపండి: నిమ్మగడ్డ
బాధ్యతలనుంచి తప్పుకున్న చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు:
మరోవైపు ఎస్ఈసీ ఆదేశాల మేరకు చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు నారాయణ భరత్ గుప్పతా, శామ్యూల్ ఆనంద్ కుమార్ లను తిరుపతి ఆర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారిని సాధారణ పరిపాలనాశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం (జనవరి 26) రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టరు మార్కండేయులుకు గుంటూరు జిల్లా కలెక్టరుగా అక్కడి జాయింట్ కలెక్టర్ సెంథిల్ కుమార్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గత మార్చిలో ఎన్నికల సందర్భంగా అక్రమాలను, హింసాకాండను నిలువరించడంతో విఫలమయ్యారన్న కారణంతో చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లు, తిరుపతి ఆర్బన్ ఎస్పీ సహా 9 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ఎస్ఈసీ ఆదేశించారు. తాజా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎస్ఈసీ వారిని తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: ఉద్యోగ సంఘాల నేతలతో ఆదిత్యనాథ్ దాస్ భేటి