వెతుక్కుంటున్నా
మా మనుషులెక్కడన్నా కనపడతారేమోనని
యాక్సిడెంటయి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే వాణ్ని
విడియోలు తీసేవాళ్ళు కనిపిస్తున్నారు.
రోడ్డు మీద, సినిమా హల్లో, కాలేజిలో స్త్రీలను వేధించే వాళ్ళను
చూస్తూనే పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు.
కళ్ళముందు పట్టపగలు నడిబజారులో హత్య జరిగినా
సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని పారిపోయేవాళ్ళు కనిపిస్తున్నారు.
కళ్ళెదురుగా కల్తీ చేస్తున్న వాణ్ని
పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు కనిపిస్తున్నారు.
తూకంలో మోసాన్ని గమనించికూడా
అడగడం నామోషీగా భావించే వాళ్ళు కనిపిస్తున్నారు.
లంచం అడిగిన వాణ్ని సంతోషంగా చూస్తూ
ఎవరు తినడంలేదో చెప్పమనేవాళ్ళు కనిపిస్తున్నారు.
ఎవరైనా ఇలాంటి వాళ్ళను నిలదీస్తే
ఛాందసుడని చప్పరించేస్తున్నారు.
వీళ్ళందరూ కనిపిస్తున్నారు కాని
నాకు మనుషులెవ్వరూ కనిపించడం లేదు.
మీకు కనిపిస్తే నాకు కాస్త చెప్పరూ.
Also read: కుపిత
Also read: మేలుకో ఓటరూ!
Also read: అంత్య ఘడియలు
Also read: భూతలస్వర్గం కశ్మీర్
Also read: భావదాస్యం