నాడు పరాయి పాలనను వ్యతిరేకిస్తూ
దేశం గర్జించింది ‘క్విట్ ఇండియా‘ అని
తెల్ల దొరలు పోయారు
నల్ల దొరలు వచ్చారు
పంచవర్ష ప్రణాళికలు
గరీబీ హటావో అంటూ
లైసెన్స్ రాజ్యం నడిపించారు
సర్వ నాశనం చేరువలో
సోషలిజం వదలి
స్వతంత్ర మార్కెట్ అన్నారు
అన్నిటికీ గేట్లెత్తేశారు,
అవినీతితో సహా.
విదేశీ పెట్టుబడులు వచ్చాయ్
సాంకేతికత పెరిగింది
ప్రపంచీకరణ జరిగింది
ప్రభుత్వ ఆస్తులు అమ్మారు
ఇంతా చేస్తే సామాన్యుడికి ఏం ఒరిగింది
అధిక ధరల పోటు
పెరిగిన పన్నుల వేటు
వీటికి తోడు కరోనా కాటు.
ఇప్పుడు మరోసారి అందాం
‘క్విట్ ఇండియా‘ అని
చట్టాన్ని గౌరవించని వాళ్ళు
మతాన్ని ఉన్మాదం చేసుకునే వాళ్ళు
తుపాకీతో అధికారం కోరుకునే వాళ్ళు
విధ్వంసకారుల తోడు కోరే వాళ్ళు
క్విట్ ఇండియా
రాజకీయుల కుతంత్రాలను ఎండగట్టే వాళ్ళు
ప్రజలను మంచివైపుకు నడిపించగల వాళ్ళు
రండి, రారండి
నవభారత నిర్మాతలు కండి
ఈ దారికి అడ్డు తగిలే వారికి
చెప్పండి క్విట్ ఇండియా అని.
Also read: ఇది వేద భూమి
Also read: ఫ్రపంచం
Also read: విజ్ఞానం – జ్ఞానం
Also read: స్నేహం
Also read: అనిత్య సత్యం