పాతదంతా భోగి మంటల్లో
ఆహుతి చేసే కాలం
ధాన్యం ఇంటికి వచ్చే కాలం
సౌభాగ్యం వెల్లివిరిసే కాలం
పశుసంపదను పూజించే కాలం
రుతువులోని జడత్వం తగ్గి
నవ చైతన్యం పెరిగే కాలం
రోగ కారకాలు నశించి
ఆరోగ్యం వికసించే కాలం
ఆనందంగా పండగ చేసుకునే
ఉత్తరాయణ పుణ్య కాలం.
పాత బాదరబందీలను వదిలించుకుని
వసంతాగమనానికి ఎదురుచూసే కాలం
కొత్త ఆశలతో మనసుని నింపే కాలం
నలుగురితో కలిసి ఆనందించే కాలం
చురుకుదనం పెరగే కాలం
జగతిని క్రాంతి నింపే కాలం.
Also read: “రాజ్యాంగం”
Also read: “ఏది నిజం”
Also read: “దొంగ”
Also read: ‘‘శార్వరి”
Also read: “సామరస్యం”