- ఇంగ్లండ్ 205 పరుగులకే ఆలౌట్
- అక్షర్ 4, అశ్విన్ 3, సిరాజ్ 2, సుందర్ 1 వికెట్
భారత్- ఇంగ్లండ్ జట్ల ఆఖరిటెస్టు తొలిరోజు ఆటలో సైతం బౌలర్ల హవానే కొనసాగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ సాధారణ టెస్టు మ్యాచ్ లో సైతం ఇంగ్లండ్ జట్టే మరోసారి కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొనడంలో విఫలమైనా 205 పరుగుల స్కోరుమాత్రం నమోదు చేయగలిగింది.సమాధానంగా తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన భారతజట్టు తొలిరోజుఆట ముగిసే సమయానికి ఓపెనర్ శుభ్ మన్ గిల్ వికెట్ నష్టపోయి 24 పరుగులు చేసింది.ఓపెనర్ రోహిత్ శర్మ 8, వన్ డౌన్ పూజారా 15 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలిచారు. రెండోరోజుఆటలో భారత్ మరో 181 పరుగులు సాధించగలిగితే ఇంగ్లండ్ స్కోరును సమం చేయగలుగుతుంది.
ఆఖరిటెస్టుకు మెరుగైన పిచ్….
డే-నైట్ టెస్టుకోసం మోడీ స్టేడియంలో ఉపయోగించిన పిచ్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో డే మ్యాచ్ గా ప్రారంభమైన ఆఖరిటెస్టుమ్యాచ్ కోసం మాత్రం మెరుగైన పిచ్ నే క్యూరేటర్ ఉంచారు.మూడోటెస్టులో కేవలం రెండురోజుల్లోనే ఆలౌటై 10 వికెట్లతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ తుదిజట్టులోకి అదనపు బ్యాట్స్ మన్ ను చేర్చుకోడంతో పాటు ఆఫ్ స్పిన్నర్ బెస్ కు సైతం చోటు కల్పించింది.మరోవైపు ఆతిథ్య భారత్ సైతం బుమ్రా కు బదులుగా మహ్మద్ సిరాజ్ ను తుదిజట్టులోకి తీసుకోడం ద్వారా బరిలో నిలిచాయి.
Also Read: కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ
ఇంగ్లండ్ కే మరోసారి టాస్…
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మరోసారి కీలక టాస్ నెగ్గి ఎప్పటిలానే బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. అయితే ఓపెనర్లు క్రాలే- సిబ్లే మరోసారి చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు. జట్టు స్కోరు 15 పరుగులున్న సమయానికే భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇద్దరు ఓపెనర్లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవీలియన్ దారి పట్టించాడు.చివరకు కెప్టెన్ జో రూట్ సైతం పేసర్ సిరాజ్ బౌలింగ్ లో 5 పరుగుల స్కోరుకే అవుట్ కావడంతో మరోసారి కష్ట్లాలు ప్రారంభమయ్యాయి.ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్- వన్ డౌన్ బెయిర్ స్టో మూడోవికెట్ కు ఓర్పుగా ఆడి జట్టును ఆదుకోడానికి ప్రయత్నించారు. బెయిర్ స్టో 28, పోపే 29 పరుగులకు స్కోర్లకు అవుట్ కాగా స్టోక్స్ 121 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 55 పరుగుల స్కోరుకు సుందర్ బౌలింగ్ లో చిక్కాడు.
మిడిలార్డర్ ఆటగాడు లారెన్స్ 74 బాల్స్ లో 8 బౌండ్రీలతో 46 పరుగుల స్కోరు సాధించి అక్షర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మొత్తం మీద ఇంగ్లండ్ 75.5 ఓవర్లలో 205 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యారు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు.
Also Read: పూజారాకు గత 19 టెస్టులుగా సెంచరీ కరవు
శుభ్ మన్ డకౌట్…
ఇంగ్లండ్ స్కోరు 206 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ను తొలి ఓవర్లలోనే ఇంగ్లండ్ స్వింగ్ గ్రేట్ యాండర్సన్ దెబ్బ కొట్టాడు. కేవలం మూడు బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ రివ్యూ కోరినా ప్రయోజనం లేకపోయింది. యాండర్సన్ ఐదుకు ఐదు ఓవర్లూ మేడిన్లుగా ముగియటం విశేషం.రెండోరోజుఆటలో భారత్ 300కు పైగా స్కోరు సాధించగలిగితే ఇంగ్లండ్ కు వరుసగా మూడో పరాజయం తప్పదు.