తెలుగు భాష
మన సంస్కృతి ప్రతీక
లావణ్య తెలుగు
పదం చివర అచ్చులతో
ఇటాలియన్ తప్ప
ప్రాక్పశ్చిమాలలో
సాటిలేని సుందర భాష
హకార నకార హాహాకారాలు లేని
చెవులకింపైన భాష
సంస్కృత సౌరభంతో
గ్రాంధిక గ్రామ్య మేలు కలయికతో
శిష్ట వ్యవహారికంగా
కాలానుగుణంగా మారుతూ
కవులను సంతృప్తులను చేస్తూ
ఎన్నో అందాలను సింగారించుకుంటూ
అమర భాషకు సాటిగా
అజరామరంగా సాగాలి నా భాష
సుమధుర తెలుగు
భాషామతల్లికి నా అభివందనం.
Also read: సజీవ శిల్పం
Also read: సంస్కృతం
Also read: మరక మంచిదే
Also read: ఙాన జ్యోతి
Also read: ఆనంద మార్గం