Monday, January 27, 2025

లాల్ బహదూర్ శాస్త్రి

భారత దేశానికి నెహ్రూ తరువాతి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి.

పేద కుటుంబంలో పుట్టాడు. గంగానది అవతలి ఒడ్డున ఉన్న బడికి నావలో వెళ్లడానికి డబ్బు లేక రోజూ నదిని ఈదుకుని బడికి వెళ్ళి వచ్చేవాడు. నెహ్రూ హయాంలో రైల్వే మంత్రిగా ఉండి ఒక రైలు ప్రమాదానికి గురైనపుడు రాజీనామా చేశాడు. ప్రధాన మంత్రిగా ఉన్నపుడు సొంత కారు లేదని అందరూ మాట్లాడితే అప్పుచేసి కారు కొన్నాడు.

పాకిస్తాన్ తో యుద్ధం వస్తే దీటుగా ఎదుర్కొన్న ఐదడుగుల వీరుడు. నిధులు లేక ప్రజల నడిగితే ప్రజలు డబ్బు,  నగలు ఉదారంగా ఇచ్చారు. శత్రువుకు అగ్రరాజ్యం అమెరికా వత్తాసు పలికితే వేలు చూపించి తప్పు చేస్తున్నావని నిలదీసిన ధీరుడు.

ఆ నాడు ప్రతి ఏడు

PL480 అనే స్కీం తో అమెరికా స్టీమర్ల నిండా  గోధుమలు తెచ్చి మనకు దానమిస్తేనే మన ఉత్తర భారతానికి భోజనం. ఆ స్థితి నుండి బయట పడడానికి వ్యవసాయ అభివృద్దికి కృషి చేశాడు. స్వామినాధన్ అనే వ్యవసాయ పరిశోధకుడితో సంకర గోధుమ మొక్కలు తయారు చేయించి అధిక దిగుబడి సాధించాడు. అంతవరకు భారతీయులందరినీ వారానికి ఒక పూట భోజనం మాన మన్నాడు. అందరూ దాన్ని పాటించారు.

‘జై జవాన్, జై కిసాన్’ నినాదంతో భారత రక్షణ,  వ్యవసాయ రంగాల అభివృద్ధికి కారకుడు. పాకిస్తాన్ తో యుద్ధం తరువాత రష్యా ఇద్దరికీ సంధి కుదురుస్తానంటే తాష్కెంట్ నగరం వెళ్లి ఆక్కడే చనిపోయాడు. అతని చావు గురించి అనుమానాలున్నా అతని తరువాత ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధి ఆయన చావు గురించి విచారణ జరిపించ లేదు. కష్ట కాలంలో దేశాన్ని సరైన దిశలో నడిపించిన నిస్వార్థ త్యాగ జీవి లాల్ బహదూర్ శాస్త్రి.

ఈ రోజు (అక్టోబర్ 2) ఆయన జయంతి సందర్భంగా ఆయనకు వందనం.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles