గాంధార దేశపు రాకుమారి
దుష్ట శకుని సహోదరి
నేత్రహీన కౌరవ జేష్టుడు
ధ్రుతరాష్త్రుడి పట్టమహిషి
భర్తకులేని చూపు
తనకూ వద్దనుకున్న ధర్మపత్ని
పాండవులకు న్యాయం చేయమని
స్వార్ధం నిండిన భర్తను
పదే పదే కోరిన సౌజన్యమూర్తి
కురుక్షేత్ర యుద్ధంలో
అధర్ముడైన పుత్రుడు
దుర్యోధనుడు కోరినా
విజయుడవు కమ్మని
ఆశీర్వదించని ధర్మమూర్తి
అమ్మతనం కంటే
ధర్మం పాటించడం
ముఖ్యమని లోకానికి చాటిన
పెద్దమ్మకు వందనం.
Also read: “పుస్తకం”
Also read: “చేతన”
Also read: “చివరి మాట”
Also read: “స్వఛ్ఛం”
Also read: “రాముడు”