Sunday, December 22, 2024

ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీపై కత్తితో దాడి. శస్త్ర చికిత్స, వెంటిలేటర్ సహాయంతో శ్వాస

వివాదస్పదుడైన ప్రఖ్యాత ఆంగ్ల రచయిత సల్మాన్ రష్డీని న్యూయార్క్ లో శుక్రవారంనాడు ఒక సదస్సులో దుండగుడు కత్తితో మెడపైన పదేపదే పొడిచాడు. ఆగంతుకుడు దాడి చేయగానే రుష్డీ కిందపడిపోయారు. వేదికపైన ఉన్నవారు, సభలో ఉన్నవారు దుండగీడును పట్టుకున్నారు. రష్డీని అత్యవసరంగా హెలికాప్టర్ లో ఆ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

ఆస్మత్రిలో శస్త్రచికిత్స చేసిన అనంతరం వెంటిలేరన్ మీద ఉంచారు. మెడదగ్గర, చేతి దగ్గర నరాలు తెగిపోయాయనీ, ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉన్నదనీ రష్డీ ఆరోగ్యంపైన వివరణ ఇస్తూ వైద్యులు తెలిపారు.

శాటానిక్ వర్సెస్ అనే గ్రంధాన్ని 1980 దశకంలో ప్రచురించిన దరిమిలా ముస్లిం సామాజికవర్గం ఆగ్రహోదగ్రమైంది. ఇరాన్ పాలకుడు అయతుల్లా ఖొమైనీ ఆ పుస్తకాన్ని ఇరాన్ లో బహిష్కరించడమే కాకుండా రచయిత రష్డీని అంతమొందించాలని ఫత్వా జారీ చేశారు. ఖొమైనీ 1989లో ఈ లోకం వదిలి వెళ్లిపోయారు.

సదస్సు న్యూయార్క్ నగరానికి నూరు కిలోమీటర్ల దూరంలో (బఫెల్లోకి 55 కిలోమీటర్లు) పల్లె వాతావరణంలో ఉన్న ఒక సంస్థలో నిర్వహించారు. అక్కడ వరుసగా ప్రసంగాలు ఏర్పాటు చేశారు. రష్డీ ప్రసంగం వినేందుకు 2,500 మంది సభికులు హాలులో కూర్చున్నారు. రష్డీని దుండగీడు కత్తితో పొడిచాడని న్యూయార్క్ పోలీసులు నిర్ధారించారు. అతిథిని మాడరేటర్ హెన్రీ రీస్ సభకు పరిచయం చేస్తున్న సమయంలో ముఖానికి ముసుగువేసుకొని నల్లని దుస్తులు ధరించిన దుండగీడు వేదికపైకి ఉరికి సల్మాన్ రుష్టీపైకి లంఘించి పది, పదిహేను సార్లు పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మాడరేటర్ కు కూడా తలకు గాయాలైనాయి.

సల్మాన్ రష్డీ తన మొదటి నవలను 1975లో రాశారు. రెండవ పుస్తకం ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ భారత స్వాతంత్ర్య సముపార్జన తర్వాత దేశంలో పరిణామాలకూ, ప్రజల జీవితాలకూ సంబంధించింది. దీనితో మంచి పేరుప్రఖ్యాతులు వచ్చాయి. బుకర్ ప్రైజ్ లభించింది. 2007లో ఇంగ్లండ్ రాణి ‘సర్’ బిరుదాన్ని ఇచ్చారు. కానీ శాటానికి వర్సెస్ తో ముస్లిం ప్రపంచం రష్డీకి శత్రువుగా మారింది. అది ఇస్లాంను కించబరిచేదిగా ఉన్నదని ముస్లింల అభిప్రాయం. రష్డీని చంపినవారికి 30 లక్షల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు. దీంతో తన పిల్లలకి కూడా కనిపించకుండా అత్యంత రహస్యంగా పదేళ్ళపాటు బ్రిటన్ లో జీవించారు. 1998లో ఇరాన్ రుష్డీని చంపడం అనే ఆలోచనను తాము సమర్థించడం లేదని ప్రకటించిన తర్వాత బయట ప్రపంచంలో అడుగుపెట్టారు.

ముస్లిం సమాజం ఆగ్రహానికి గురైన మరో రచయిత తస్లీమా నస్రీన్ ఒక ట్వీట్ లో, ‘‘న్యూయార్క్ లో సల్మాన్ రష్డీపైన దాడి జరిగిందని ఇప్పుడే విన్నాను. నేను దాగ్భ్రాంతికి గురైనాను. ఇట్లా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. 1989  నుంచి ఆయన పాశ్చాత్య దేశాలలో భద్రతావలయంలో జీవిస్తున్నారు. ఆయనపైనే దాడి చేస్తే ఇస్లాంను విమర్శించేవారు ఎవరైనా వారిపైన దాడి జరగవచ్చు. నాకు ఆందోళనగా ఉంది,’’ అన్నారు.

సభలో ఉన్న బ్రిటిష్ రచయిత (భారత్ లో నివసిస్తున్నారు) విలియం డార్లింపుల్ ఆవేదన వెలిబుచ్చారు. పాపం సల్మాన్. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. భావస్వాతంత్ర్యానికి, సాహిత్యానికీ, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న రచయితలకు ఇది ప్రమాదం అన్నారు.  బ్రిటన్ లో ప్రధాని పదవికి పోటీపడుతున్న భారత సంతతి బ్రిటన్ పౌరుడు రిషీ సునాక్ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘భావస్వాతంత్ర్యానికీ, సాహిత్యకారుల స్వాతంత్ర్యానికీ పట్టం కట్టే వ్యక్తిపైన దాడి జరగడాన్న ఆయన ఖండించారు. కాలమిస్ట్ తారెక్ ఫతా సల్మాన్ కు సంఘీభావం తెలిపారు. ఆగంతుకుడిపైన కఠిన చర్యలు తసుకుంటారని బాలీవుడ్ గీతరచయి జావెద్ అఖ్తర్ అన్నారు. న్యూయార్క్ స్టేట్ గవర్నర్ కేతీ హోచుల్ పశ్చిమ న్యూయార్క్ లో వేదికపైన రుష్డీపై దాడి జరగడం గుండెను పిండివేసే సత్యం. తుపాకీలను అదుపు చేయాలని కోరే సమావేశంలో గవర్నర్ హోచుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్ రష్డీ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్నారు.   

Related Articles

1 COMMENT

  1. The clerics, who live in the said holy books of their respective religions and are ill-informed of the scientific understanding of the changing modern world are always a threat to the existence of their religions. The nature of any religious group is to fight for its survival. In the process, the religions take an ugly turn because of the fortified politics and economics. We know how the Christians’ trade and aftermath politics of the crusades tarnished the image of Islam. In countering the impending image, Islam did not take sane calculative ways of fighting, instead had given reigns to the tribal clerics. It is evident that Salman Rushdie’s work is marked by the notoriety of presenting moral (representational) characters of their (Islam’s) holy books. But fatwa made him more popular and has garnered him more creative sympathies. The Catholic Christians, we all know, had in deed ignored and allowed the novel Da Vinci Code as a work of fiction. Here allowing the works of creativity will make the very religion a lofty one among the emerging democratic-minded people. So playing and surviving on politics and undemocratic irrational calls make any religion blow its death knell. We should understand Javed Akhtar (of course he is an atheist) when he calls for reformations in every religion giving scope for democratic rationale.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles