Tuesday, December 3, 2024

సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్ర గాయాలు

స్పోర్ట్స్ బైక్ పై నుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి

అతివేగం వల్లనే ప్రమాదం

హైదరాబాద్‌: ‘మెగా’ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు. మాధాపూర్ లో కేబిల్ బ్రిడ్జ్ పైన ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి గం. 7.45ల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని డీసీపీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఎనిమిదింటికల్లా ఆస్పత్రికి తీసుకొని వచ్చారు.

ధరమ్ తేజ్ ఉపయోగించిన స్పోర్ట్స్ బైక్

ముప్పయ్ నాలుగు సంవత్సరాల నటుడికి తలపైనా, ఛాతిపైనా, చేతులపైనా గాయాలు అయ్యాయని వైద్యులు చెప్పారు. ఈ వార్త తెలిసిన వెంటనే మెడీకవర్ ఆస్పత్రికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజే తమ్ముడు, సినిమా నటుడు వైష్ణవ్ తేజ్, సినిమా నిర్మాత అల్లు అరవింద్ హుటాహుటిన వెళ్లారు. అనంతరం తేజ్ ను జూబిలీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. సాయి దర్మ తేజ్ మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles