- హోమ్ క్వారెంటెన్ లో సచిన్
- ఆరుదేశాల టోర్నీలో పాల్గొని వచ్చిన సచిన్
భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ను కరోనా వైరస్ సోకింది. ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా,జాగురూకతతో వ్యవహరించే మాస్టర్ సచిన్ గత ఏడాది వచ్చిన తొలివేవ్ లో తప్పించుకొన్నా ప్రస్తుత రెండో వేవ్ లో మాత్రం దొరికిపోయాడు.
ఇటీవలే రాయ్ పూర్ వేదికగా ముగిసిన ఆరుదేశాల లెజెండ్స్ టీ-20 టోర్నీలో పాల్గొన్న భారతజట్టుకు సచిన్ నాయకత్వం వహించాడు. భారత్ ను విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర వహించాడు.శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ కు చెందిన మొత్తం 120 మంది మాజీ దిగ్గజఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. క్రిమిరహిత బయోబబుల్ వాతావరణంలో గడిపి వచ్చిన సచిన్ ముంబైకి తిరిగి వచ్చిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకొన్నాడు. ఫలితం పాజిటివ్ గా రావడంతో వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హోం క్వారెంటెన్ పాటిస్తున్నాడు.
Also Read: లెజెండ్స్ టీ-20 విజేత భారత్
కరోనా వైరస్ నుంచి బయటపడటానికి తాను నిపుణులు,వైద్యుల సలహాలుసూచనలు తుచతప్పక పాటిస్తున్నానని,తనతో పాటు దేశంలోని కోట్లాదిమందికి సేవలు అందిస్తూ వైరస్ తో పోరాడుతున్న వైద్యసిబ్బందికి, ఆరోగ్యశాఖ ఉద్యోగులకు తాను రుణపడి ఉంటానని ఓ సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టదని, సామాన్యులు, సెలబ్రిటీలు అన్నతేడానే చూపదనటానికి మాస్టర్ సచిన్ కు కరోనా పాజిటివ్ రావడమే నిదర్శనం.
Also Read: సెంచరీల కోసం ఆడను- విరాట్