- ముస్లాఖ్ అలీ టోర్నమెంటు టీ20లో ముంబయ్ జట్టులో సభ్యుడు
- 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్
- సచిన్ సెంచరీలో అట్టహాసంగా రంగప్రవేశం చేసిన32 ఏళ్ళకు అర్జున్ అడుగు పెట్టిన వైనం
ముంబయ్ : సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబయ్ సీనియర్ల పక్షాన శుక్రవారం నాడు తొలి మ్యాచ్ ఆడాడు. వాంఖెడే స్టేడియంలో తన 15 ఏళ్ళ వయస్సులో 32 ఏళ్ల కిందట రంజీట్రోఫిలో గుజరాత్ పైన ఆడిన ముంబయ్ జట్టులో సచీన్ టెండూల్కర్ ఆడాడు. మళ్ళీ తన కుమారుడు ఇప్పుడు జాతీయ స్థాయి టోర్నమెంటులో ప్రప్రథమంగా అడుగుపెట్టాడు. నాడు సచిన్ తన క్రికెట్ జీవితాన్ని సెంచరీతో ఆరంభించాడు. అర్జున్ కి అంత అదృష్టం లేకపోయింది. జీరో నాటౌట్ స్కోర్ లో పదకొండవ బ్యాట్స్ మన్ గా మిగిలాడు. బౌలింగ్ లో మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. ఈ టీ-20 మ్యాచ్ లో కూడా ముంబయ్ ఓడిపోయింది. ఎనిమిది వికెట్ల తేడాతో వరుసగా మూడవ పరాజయం చవిచూసిన ముంబయ్ జట్టు నిబంధనల ప్రకారం ఈ టోర్నమెంటు నుంచి వైదొలగవలసి వచ్చింది.
గురువారంనాడే శుభవార్త
సచిన్ టెండూల్కర్ కూ, ఆయన భార్య డాక్టర్ అంజలికీ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురువారంనాడే శుభవార్త అందించి సంతోషపెట్టాడు. అర్జున్ సయ్యద్ ముస్తాఖ్ అలీ టోర్నమెంటులో మూడో మ్యాచ్ లో ముంబయ్ సీనియర్ల జట్టులో ఆడతాడని గురువారంనాడు నిర్ణయించారు. ఇక్కడి బంద్రా కుర్లా కాంప్లెక్ల్ లో హరియాణాతో తలబడిన ముంబయ్ టీమ్ లోని పదకొండు మంది ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ఎంపికైనాడు.
Also Read : వందటెస్టుల క్లబ్ లో కంగారూ ఆఫ్ స్పిన్నర్
ఎడమ చేతి వాటం
ఇరవై ఒక్క సంవత్సరాల అర్జున్ ఆటతీరు తండ్రి సచిన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎడమ చేతివాటం సీమ్ బౌలర్ గా అర్జున్ కు మంచి భవిష్యత్తు ఉన్నదని అతడి ఆట తీరు చూసిన ప్రవీణులు అంటున్నారు. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇండియన్ టీమ్ లోని సీనియర్లకు అర్జున్ బౌల్ చేశాడు. అర్జున్ ఇంతకు ముందు 19 ఏళ్ళలోపు ఇండియన్ టీమ్ లో ఆడాడు. ఆ జట్టులో తన 18వ ఏట చేరాడు. శ్రీలంకలో పర్యటించాడు. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ కూడా చేసే అర్జున్ ఆల్ రౌండర్. తండ్రి బ్యాట్స్ మన్ గా ప్రపంచ ప్రఖ్యాతి గడిస్తే ఇతడు ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకోవడానికి తొలి అడుగులు వేస్తున్నాడు. ముస్తాఖ్ అలీ టోర్నమెంటులో ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ముంబయ్ ఓడిపోయింది. సొంత నగరంలో ఈ స్తాయి సీనియర్ క్రికెట్ లో ప్రవేశిస్తున్న అర్జున్ పైనే అందరి కళ్ళూ ఉన్నాయి. ముంబయ్ సీనియర్ల జట్టుకు అర్జున్ ముందు సెలక్ట్ కాలేదు.
Also Read : బ్రిస్బేన్ టెస్ట్ తొలిరోజున హోరాహోరీ
ఐపీఎల్ ఎంపికకు అర్హత
ముప్పయ్ ఒక్క మందిని మాత్రమే తీసుకోవలసి వచ్చినప్పుడు అర్జున్ కి అవకాశం రాలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబయ్ జట్టుకు 33 మందిని ఎంపిక చేయవచ్చునని నిబంధనలను సడలించిన తర్వాత అర్జున్ కి అవకాశం లభించింది. అర్జున్ తో పాటు కృతిక్ హనగవాదీని కూడా ముంబయ్ సీనియర్ల జట్టుకు సునీల్ అంకోలా నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
తన రాష్ట్రం జట్టులో ఒక్క మ్యాచ్ ఆడిన అర్జున్ వచ్చే నెల జరగబోయే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) పోలీలలో క్రికెటర్ల ఎంపిక జరిగే సమయంలో ఏ జట్టులోనైనా ఆడేందుకు అర్హత సంపాదించినట్టు అయింది.
Also Read : భారత 300వ టెస్ట్ క్రికెటర్ నటరాజన్