- అర్జున్ టెండూల్కర్ కి ముంబాయ్ జట్టులో స్థానం
- 22 మంది జట్టులో ఒకడిగా ఎంపిక
- ముస్తాఖ్ అలీ టోర్నమెంట్ తో మొదలు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్- అంజలి ల ముద్దుల కొడుకు అర్జున్ టెండుల్కర్ భారత క్రికెట్ రంగంలో కీలక మైన ముంబాయి జట్టుకు ఎంపికయ్యాడు! ఇది పెద్ద విజయమే! ఎన్నో విమర్శల మధ్య నైతిక విజయం కోల్పోయినా, తిరిగి పట్టుదలతో ప్రతిష్టాత్మకమైన ముంబయి జట్టులో ఆడే అవకాశం అర్జున్ కు వచ్చింది. సచిన్ టెండూల్కర్ తనయుడుగా కాకుండా ఆటగాడిగా ప్రతిభ చూపి తొలిసారి ముంబై జట్టులో స్థానం దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభంకానుండగా ఇటీవల 20 మందితో కూడిన జట్టుని ముంబయి టీమ్ సెలెక్టర్లు ప్రకటించారు. కానీ అందులో అర్జున్ టెండూల్కర్‌కి చోటు దక్కలేదు. అయితే బీసీసీఐ తాజాగా రూల్‌ని మార్చి టీమ్‌లోకి 22 మంది ఆటగాళ్లని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఆల్ రౌండర్ కోటాలో అర్జున్ కి ముంబై టీమ్ లో చోటు దక్కింది. రాబోయే టి 20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కోసం 22 మంది సభ్యుల టీమ్ లో
దిగ్గజ సచిన్ టెండూల్కర్ కుమారుడు యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ టెండూల్కర్ శనివారం ముంబై సీనియర్ జట్టులో తొలిసారిగా స్థానం సంపాదించుకున్నాడు., రాబోయే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కోసం 22 మంది సభ్యుల బృందంలో కూడా అర్జున్ పాల్గొన్నాడు.
ఈ విషయాన్ని ముంబై జట్టు చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా శనివారం ధృవీకరించారు. అర్జున్ కాకుండా మరో పేసర్ క్రుటిక్ హనగవాడిని కూడా 22 మంది సభ్యుల జట్టులో చేర్చారు. 21 ఏళ్ల అర్జున్‌ను ముంబై సీనియర్స్ జట్టులో చేర్చుకోవడం ఇదే మొదటిసారి. అతను ముంబై కోసం ఏజ్-గ్రూప్ టోర్నమెంట్లు ఆడుతున్నాడు. ఆహ్వాన టోర్నమెంట్లు ఆడే జట్టులో కూడా ఉన్నాడు. అంతకుముందు, పేసర్ భారత జాతీయ జట్టు నెట్స్ లో బౌలింగ్ చేశాడు భారత్ అండర్ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు, అర్జున్ గతంలో శ్రీలంకలో పర్యటించారు. ఇప్పుడు ముంబై జట్టుకు పేరుగాంచిన బ్యాట్స్ మాన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు.జాతీయ టి 20 ఛాంపియన్‌షిప్ అయిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ జనవరి 10 నుంచి దేశీయ సీజన్‌ను ప్రారంభించనుంది.
అర్జున్ 24 సెప్టెంబర్ 1999న ముంబై లో జన్మించాడు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుకున్నఅర్జున్ కు ఒక అక్కయ్య ఉంది. ఆ అమ్మాయి పేరు సారా! తన క్రికెట్ వారసుడిని తయారు చేయాలని సచిన్ అండర్- 13 నుండి కొడుకును క్రికెట్ రంగం లోకి దించాడు. తల్లి అంజలి డాక్టర్ అయినా తండ్రి అభిరుచి కొడుకుకు అబ్బింది. ఇంగ్లండ్ క్రికెటర్ లతో శిక్షణ ఇప్పించడమే కాకుండా తండ్రి కూడా అర్జున్ కి క్రికెట్ ఓనమాలు నేర్పాడు. టి-20 ముంబై లీగ్‌తో పాటు, 2017 లో కూచ్ బెహర్ ట్రోఫీలో 18 వికెట్లతో ముంబై తరఫున ఆడిన అర్జున్ తన సత్తా చూపంచాడు. భారత్ అండర్ -19 దేశీయ సర్క్యూట్‌లో అర్జున్ టెండూల్కర్ తన పరాక్రమాన్ని చూపి అతనికి ఇండియా అండర్ -19 లో చోటు దక్కేలా చేశాయి. గత సంవత్సరం శ్రీలంకలో పర్యటించిన టెస్ట్ జట్టులో కూడా అర్జున్ స్థానం సంపాదించుకున్నాడు. ఆ సిరీస్‌లో అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఫ్రాంచైజ్ క్రికెట్, అండర్ -19 ఇంటర్నేషనల్స్ క్రీడలో అత్యుత్తమమైన ఆటతీరును కనబరిచిన అర్జున్ టెండూల్కర్ జట్టులోకి పిలిచినప్పుడల్లా అందరినీ ఆకట్టుకున్నాడు. భారతదేశం ఎడమచేతి వాటం పేసర్ల కొరతను కలిగి ఉండటంతో, ఉజ్వల తారగా ఎంపికైన అర్జున్ కు మంచి భవిష్యత్ ఉంది.