రామాయణం – 93
రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన మార్గములో ప్రయాణించి పంపసరోవర మార్గమును. అక్కడ ఉన్న పర్వతాలమీద సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని చూసుకుంటూ వెళుతున్నారు. అలా వెళుతూ వెళుతూ పంపా సరోవర పశ్చిమ భాగాన్ని చేరారు.
అక్కడ వారికి వృద్ధ తాపసి, మతంగముని శిష్యురాలు అయిన శబరి కనుపించింది. ఆవిడ రామలక్ష్మణులను చూసి లేచి అంజలి ఘటించి నమస్కరించింది. తీవ్రమైన నియమాలు పాటిస్తూ తపస్సు చేస్తున్న శబరిని చూసి ఆదరముగా కుశల ప్రశ్నలు వేసాడు రాఘవుడు.
Also read: రామలక్ష్మణులకు బుుష్యమూక పర్వతానికి దారి చెప్పిన కబంధుడు
‘‘తల్లీశబరీ నీవుచాంద్రాయణాది వ్రతములన్నీపూర్తిచేసుకున్నావా? నీ తపస్సు సిద్ధించినదా?’’ అని ప్రశ్నించాడు రాముడు .
అందుకు సమాధానముగా శబరి, ‘‘రామా, నీ దర్శన భాగ్యమే నా తపస్సు సిద్ధించినదనుటకు చిహ్నమయ్యా. నా గురువుగారు నాకు చెప్పిన విధముగా నీ దర్శనము వలన నా జన్మ చరితార్ధమైనది రామా. నేటితో నాకు సకలము సిద్ధించినది రామా’’ అని పలికి మతంగ వనము నుండి తాను సేకరించిన మధుర ఫలాలతో వారికి ఆతిధ్యమిచ్చి, ‘‘రామా నీ అనుజ్ఞ అయినచో నా కళేబరాన్ని విడిచిపెట్టేస్తానయ్యా’’ అని పలికింది ఆ వృద్ధ తాపసి.
Also read: కబంధుని వధ, విమోచన
అంత రాముడు అనుజ్ఞ ఇవ్వగనే తన శరీరాన్ని అగ్నిలో హోమము చేసి స్వర్గమునకు వెళ్ళిపోయింది శబరి.
మరల అచట నుండి బయలు దేరి సుగ్రీవుడు నివసించే పర్వత సమీపమునకు వెళ్ళారు రామలక్ష్మణులు. అప్పుడు రాముడు, ‘‘లక్ష్మణా, సీతను పోగొట్టుకొని
నా మనస్సు సీతపైననే నిత్యమూ లగ్నమై ఉన్నది. నేను దీనుడను. నీవు సుగ్రీవుని వద్దకు వెళ్లి మనరాకను ఎరిగించుము’’ అని పలికాడు రాముడు ఇలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఆ సరోవర తీరము చేరుకున్నారు.
శ్రీమద్రామాయణము
అరణ్య కాండము
సమాప్తము
Also read: కబంధుడి చేతచిక్కిన రామలక్ష్మణులు
వూటుకూరు జానకిరామారావు