- 758 గోల్స్ తో రెండో స్థానంలో పోర్చుగీసు స్టార్
ప్రపంచ సాకర్ సూపర్ స్టార్, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గోల్స్ మోత మోగిస్తూ ఒక్కో రికార్డును అధిగమిస్తూ దూసుకుపోతున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన దిగ్గజ ఆటగాళ్ల జాబితా రెండోస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ రెండో స్థానంలో ఉన్న బ్రెజీలియన్ గ్రేట్ పీలే ను మించిపోయాడు. ఇటాలియన్ సాకర్ లీగ్ లో యువెంటస్ క్లబ్ కు ఆడుతున్న రొనాల్డో సెరియె ‘ఎ’ లీగ్ మ్యాచ్ లో రెండుగోల్స్ సాధించడం ద్వారా 758 గోల్స్ తో రెండో స్థానంలోనిలిచాడు. ఇప్పటి వరకూ 757 గోల్స్ తో పీలే రెండోస్థానంలో కొనసాగుతున్నారు.
ఇది చదవండి: క్రీడాకారులకు పద్మ అవార్డులు
ఈ మ్యాచ్‌కు ముందు వరకూ 756 గోల్స్ తో మూడో స్థానంలో ఉన్న రొనాల్డో రెండు గోల్స్ చేసి పీలేను దాటి ముందుకెళ్లాడు. రొనాల్డోకు ప్రొఫెషనల్ లీగ్స్‌లో 656 గోల్స్ సాధించిన ఘనత ఉంది. అంతేకాదు..తన జాతీయజట్టు పోర్చుగల్ కు ఆడుతూ మొత్తం 102 గోల్స్ చేశాడు. ఫిఫా అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక గోల్స్ చేసిన సాకర్ స్టార్ల జాబితాలో 759 గోల్స్‌తో చెక్ రిపబ్లిగ్ ఆటగాడు జోసెఫ్ బికాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్టియానో రొనాల్డో మిగిలిన మ్యాచ్ ల్లో మరో రెండు గోల్స్ చేయగలిగితే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన వాడవుతాడు. రొనాల్డో రానున్న రోజుల్లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.
ఇది చదవండి: కెప్టెన్ గా విరాట్ కొహ్లీ స్టయిలే అంత…!