- సోల్కర్, శ్రీకాంత్, ద్రావిడ్ ల సరసన రోహిత్
భారత డాషింగ్ ఓపెనర్ గా సిక్సర్లు బాదడం, సెంచరీలు సాధించడం ద్వారా రికార్డులు నెలకొల్పే రోహిత్ శర్మ…ఓ ఫీల్డర్ గా కూడా రికార్డుల్లో చోటు సంపాదించాడు. ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఓ టెస్టుమ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టిన భారత నాలుగో ఫీల్డర్ గా చరిత్ర సృష్టించాడు.
బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు క్యాచ్ లు పట్టిన రోహిత్…రెండో ఇన్నింగ్స్ లో మరో మూడు క్యాచ్ లు అందుకొన్నాడు. మొత్తం 5 క్యాచ్ లతో…గతంలో ఇదే ఘనతను సొంతం చేసుకొన్న ఏక్ నాధ్ సోల్కర్, కృష్ణమాచారీ శ్రీకాంత్, రాహుల్ ద్రావిడ్ ల సరసన నిలిచాడు.
ఇది చదవండి: గబ్బాలో కంగారూలకు సిరాజ్ దెబ్బ
బ్రిస్బేన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ వార్నర్, స్టీవ్ స్మిత్, టిమ్ పెయిన్ ల క్యాచ్ లను పట్టిన రోహిత్ రెండో ఇన్నింగ్స్ లో లబుషేన్, గ్రీన్ ల క్యాచ్ లు అందుకొన్నాడు. ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 1969-70 సిరీస్ లో సోల్కర్, 1991-92 సిరీస్ లో శ్రీకాంత్, 1997-98 సిరీస్ లో రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ కు 5 క్యాచ్ లు చొప్పున అందుకొన్న ఫీల్డర్లుగా ఉన్నారు.ప్రస్తుత 2020-21 సిరీస్ లో రోహిత్ శర్మ ఐదుక్యాచ్ లు పట్టిన భారత ఫీల్డర్ గా నిలిచాడు.
ఇది చదవండి: బ్రిస్బేన్ లో సుందరశార్దూలమ్