డాక్టర్ టి. దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో చికిత్స
ప్రఖ్యాత ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ టి. దశరథరామారెడ్డి ఆధ్వర్యంలో, ఆధునిక ప్రక్రియ-రోబోటిక్ శస్త్రచికిత్స-ఆధారంగా యశోదా హాస్పిటల్, సోమాజిగూడ లో మోకాలి జాయింట్ మార్పిడి చికిత్స విజయవంతంగా జరిగింది.
డా. దశరథరామారెడ్డిగారు రోబోటిక్ విధానం ద్వారా శస్రచికిత్స విధానాన్ని వివరిస్తూ ఈ ప్రక్రియ ద్వారా శరీరం మీద కోత ఖచ్చితంగా అవసరమైన పరిమాణం మేరకే వుంటుందనీ, సాధారణ శస్ర్రచికిత్స కంటే రక్తం కోల్పోవడం చాలా తక్కువగా వుంటుందనీ అన్నారు. నొప్పి విషయంలో రోగికి అసౌకర్యం అతి స్వల్పం అనీ, నిక్కచ్చిగా ప్రమాణాలు పాటించడం సులభమైతుందనీ చెప్పారు.
చిన్న గాయమే చేస్తారు కనుక సర్జరీ అయిన కొన్ని గంటలలోనే రోగిని డిశ్చార్జ్ చేస్తారనీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరేడు వారాలలో పూర్తిగా స్వస్థత చేకూరుతుందనీ తెలుస్తోంది. ఈ లోగా ఫిజియో థిరపీ చేయించుకోవలసి వస్తుందని అన్నారు. మోకాలిలో దెబ్బతిన్న టిష్యూలను తొలగించి కృత్రిమ టిష్యూలను అమర్చడం ఇందులోని విధానం. రొబోటిక్ సర్జరీ చేయించుకున్నరోగికి తక్కువ నొప్పి ఉంటుంది. వేగంగా కోలుకుంటారు. ఈ పద్ధతి మన దేశంలో ఇప్పుడిప్పుడే వ్యాప్తిలోకి వస్తున్నది.