* సెమీఫైనల్లో సచిన్, వీరూ, యువీ జోరు
* విండీస్ పై భారతస్టార్ల సిక్సర్ల మోత
భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తమ సత్తాను మరోసారి చాటుకొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా తమ బ్యాటింగ్ లో వాడీవేడి ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు.
రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఆరుదేశాల రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ-20 సిరీస్ ఫైనల్స్ కు ఆతిథ్య భారత్ చేరడంలో మాస్టర్, బ్లాస్టర్, సిక్సర్ల కింగ్ ప్రధానపాత్ర వహించారు.
Also Read : ప్రో-బాక్సింగ్ లో సింగ్ ఈజ్ కింగ్
సచిన్, యువీ సిక్సర్ల మోత
వెస్టిండీస్ లెజెండ్స్‌తో ముగిసిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత దిగ్గజ జట్టు పూర్తిస్థాయిలో చెలరేగిపోయింది. ఓపెనింగ్ జోడీ సచిన్-వీరూ, మిడిలార్డర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ సిక్సర్ల మోత మోగించారు. ఈ కీలక మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
Also Read : భారత్ కు డూ ఆర్ డై
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో కలసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. సెహ్వాగ్ కేవలం 17 బాల్స్ లోనే 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 35 పరుగుల కు అవుటయ్యాడు. మాస్టర్ సచిన్ 42 బాల్స్ ఎదుర్కొని 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 65 పరుగులు సాధించాడు. మిడిలార్డర్ ఆటగాళ్లు కైఫ్ 21 బాల్స్ లో 2 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 27 పరుగులు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ 20 బాల్స్ లోనే ఆరు సిక్సర్లు, ఓ బౌండ్రీతో 49 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
Also Read : డకౌట్ల హీరో రాహుల్ కు టీమ్ మేనేజ్ మెంట్ దన్ను
యువరాజ్ తనదైన శైలిలో గ్రౌండ్ నలుమూలలకూ సిక్సర్లు బాదాడు. విండీస్ లెగ్ స్పిన్నర్ నాగముత్తు వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 పరుగులు రాబట్టాడు. చివర్లో ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం మెరుపులు మెరిపించాడు. కేవలం 20 బంతుల్లో 2 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 37 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
సమాధానంగా 219 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ చతికిలబడిపోయింది. దీంతో భారతజట్టు భారీవిజయంతో టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది. శ్రీలంక-సౌతాఫ్రికాజట్ల రెండో సెమీపైనల్స్ లో నెగ్గినజట్టుతో ఫైనల్లో భారత లెజెండ్స్ జట్టు తలపడనుంది. లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నిలకడగా రాణించడం విశేషం.
Also Read : కెప్టెన్ గా విరాట్ 11వ టీ-20 హాఫ్ సెంచరీ