నేను పుట్టాను
లోపల అంతా శూన్యం
గడియారం ముల్లు తిరుగుతుంటే
పెరుగుతూ పోయాను
ఒక్కొక్కటిగా లోపల
పేరుకుంటూ వచ్చాయ్
నాకో పేరు, ఊరు, బలం,
బలగం, గుణం, ఆలోచనలతో
ఒక గుర్తింపు సంతరించుకుని
ఒక అహం గా, ‘నేను‘గా ఎర్పడ్డాను.
అసీమ నుండి మొదలై
సీమ శిఖరాన్ని చేరుకున్నాను
అప్పుడు తెలిసింది
జీవితం విలువ అసీమ అని.
శిఖరం నుండి కదలి
మూలం వైపు ప్రయాణం
పేరుకున్నవి ఒక్కొక్కటి
రాల్చుకుంటూ, విదుల్చుకుంటూ
నా గుర్తింపు పూర్తిగా పొగొట్టుకొని
చేరే గమ్యం శూన్యం
అదే సీమనుండి
అసీమకు విస్తరించడం
అహం పోయి
దాసోహం కావడం.
Also read: రాజకీయ నాయకుల మాట అధికారులు ఎందుకు వినాలి?
Also read: “రాజ మార్గం”
Also read;“సారం”
Also read: “శంకరం”
Also read: “మార్చిన చరిత్ర”