Tuesday, January 21, 2025

పునరుద్ధరణవాద ప్రమాదంలో భారతదేశం

(Danger of Revivalism in India)

‘జనసాహితి’ నిర్వహణలో పదేళ్ళ క్రితం విజయవాడలో జరిగిన సమావేశంలో టి. రవిచంద్ చేసిన ప్రసంగపాఠమే ఈ పుస్తకం. రాబర్ట్ గ్రీన్ ఇంగ ర్సాల్, గోరా వంటి నాస్తిక తత్వవేత్తల నివాళితో ప్రారం భించిన ఈ ఉపన్యాస పాఠం, 1. Renaissance (పునరుజ్జీవం, పునర్వి కాసం) 2.Revolution(విప్లవం) 3.Reform (సంస్కరణ) 4. Revivalism (పునరుద్ధ రణ, మత పునరుద్ధరణ వాదం) (పేజీలు 3,4) మొద లైన అంశాల్ని క్లుప్తంగా విశ్లేషిస్తూ సాగింది !

“గత చరిత్రలో పునరుద్ధరణవాద శక్తులు ఎటువంటి పాత్ర నిర్వహించాయో తెల్సి కూడా ఈ దేశంలో ప్రగతిశీల శక్తులు అప్రమత్తం కాలేదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలతో అనైక్యతతో మతవాద రాజకీయాలకు అవకాశం కల్పిం చాం. ఇది సరిదిద్దు కోవటానికి వీలులేని చారిత్రక తప్పిదం‌.” అన్న రచయిత, “ఆధునిక యుగంలో ముఖ్యంగా జాతీయోద్య మ కాలంలో సంస్కరణవాదులు మాత్రమే పునరుద్ధరణవాద ప్రమాదాన్ని మొదట గుర్తిం చారు. దాన్ని తమ పరిధిలో ఎదుర్కో వడానికి ప్రయత్నించారు. (పేజి 8) అంటారు !

అలాంటి ఆధునిక సామాజిక సంస్కర్తలుగా ఆధునిక బౌద్ధుడయిన డా.బి.ఆర్. అంబేద్కర్ గౌరవించిన ఇరువుర్ని ఇందులో పేర్కొన్నారు,1.మహదేవ్ గోవింద రనడే 2. మహాత్మా జోతిరావు ఫూలే. అంతేకాదు, ఈ సందర్భంలో అంబేద్కర్ 70 ఏళ్ళ క్రితం రాసిన ప్రసంగ వ్యాసం Ranade, Gandhi and Jinnah ను మరోసారి చదవ మని అభ్యర్థిస్తున్నానంటూ వారిద్దరి గురించి విశ్లేషించారు (పేజి 8). భారతీయ సంస్కృతి పట్ల లోతైన అధ్యయనం ఇందులో కనిపిస్తుంది!

Our Cultural Heritage (మన సాంస్కృతిక వారసత్వం) పేరిట సర్ధార్ పటేల్ స్మారకోప న్యాసాలు (1986) చేస్తూ భార తీయ ధర్మశాస్త్ర గ్రంధాల కోసం స్వామి రంగనాథానంద చెప్పిన విలువైన మాటల్ని ఉదహరిస్తూ వర్తమాన రాజకీయ చిత్రాన్ని చూపించడం బావుంది. “అభివృద్ధి పేరుతో ఒకవైపు, భారతీయ ఆధ్యా త్మికత పేరుతో మరోవైపు అత్యధికశాతం ప్రజానీకాన్ని భ్రమల్లో ముంచడానికి ఈతరం నాయకులకు అవకాశాలెక్కువ. కాబట్టి లౌకికవాద, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు ఇది పరీక్షా సమయం. ఎంతో ఐక్యతతో, ఓపికతో మతతత్వ శక్తుల వ్యూహాల్ని ఎదుర్కొనగలగాలి.” (పేజి 13) అంటారు !

పునరుద్ధరణవాద ప్రమాదాన్ని సూచించే రెండు సంకేతాలుగా 1. చరిత్ర 2. సంస్కృతం (భాష, సంస్కృతి) (పేజి 13) పేర్కొంటూ కొన్ని ఉదంతాలు చెబుతూ ముగించిన ఈ పొత్తంలో రెండు విలువైన అనుబంధాలు పొందుపర్చారు. ఒకటి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ; బౌద్ధధర్మ ప్రతినిధి సత్యనారాయణ గోయంకాల సంయుక్త ప్రకటన. రెండు, సమకాలీన భారతీయ తత్వవేత్త, విద్యావేత్త అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆంధ్రుడు ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి (1924 – 2011) శతజయంతి సందర్భం గా ఆయన కృషిని పేర్కొంటూ చేసిన పరిచయం!

(మిళింద ప్రచురణలు, బాపట్ల గతేడాది 2023 లో ప్రచురించిన 24 పుటల ఈ పుస్తకం /కరపత్రం సీరియస్ అధ్యయన పరులకు ఒక దిక్సూచి. కాలక్షేపం కోసం కాకుండా ఆసక్తి ఉన్న మిత్రుల కోసం స్కాన్డ్ కాపీ పంపుతున్నాను. పునరు ద్ధరణవాద ప్రమాదాన్ని నిత్యం ఎదుర్కొంటున్న పౌర సమాజంలో ఆయా అంశాల గురించి జరిగే నిర్మాణాత్మ కమైన దార్శనిక సంవాదాలే ఏమేరకైనా ఉన్మాదాన్ని నిలువ రించగలవనే నమ్మకమే నా ఈ రైటప్‌కి కారణం!)

- గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles