హైదరాబాద్టీ : పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లేందుకు తన జూబిలీ హిల్స్ నివాసం నుంచి బయటకు రాగనే భారీ బందోబస్తు నడుమ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు
నిన్న రాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
కాంగ్రెస్ నేతలతో కలిసి ఎర్రవల్లి రైతులతో రచ్చబండకు బయలుదేరిన రేవంత్ ను అక్కడకు వెళ్ళడానికి ముందే పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త తెలుసుకొని
రేవంత్ ఇంటి వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. బలవంతంగా రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.