డా. ఆరవల్లి జగన్నాథస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి మీడియానే కారణమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ నాయకులు, అభ్యర్థులు శక్తిమేరకు కృషి చేసినప్పటికీ తమలో తమకు గొడవలు ఉన్నాయంటూ మీడియా ప్రచారం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘మీడియా మొదటిసారి తన పాత్రను సరిగా పోషించలేకపోయింది. నేనే చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులు వివిధ రకాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రచారం చేస్తున్న మీడియా అలారాసే నైతిక హక్కు కోల్పోయింది. ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలనే వార్తల్లో ఎక్కించి ప్యాకేజీలను ఇచ్చుకోలేని కాంగ్రెస్ ఓటమి కారణమైంది.మా పార్టీ ఓటమికి మీడియానే తప్ప రాజకీయాలు, ప్రజలు కారణం కాదు. రెండు నెలలుగా ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలను సమీక్షించుకొని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నా. కేవలం రెండు పార్టీల మధ్యే పోటీ అనే కృత్రిమ వాతావరణం సృష్టించి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకులయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోయింది. ఇక లేవదు అని ప్రచారం చేశారు. 30 శాతానికి పైగా స్థిరమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్న తమ పార్టీకి మీడియాలో చర్చల సందర్భంగానైనా తగు ప్రాధాన్యం ఇవ్వలేదు’ అన్నారు.