రిపోర్టర్ : సాదిక్
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మంత్రి మల్లారెడ్డికి సవాలు విసిరారు.
‘‘మల్లారెడ్డి నీకు దమ్ముంటే నీ అవినీతి పై విచారణ కు సిద్ధం కా.అనుచిత వ్యాఖ్యలతో తప్పించుకోవాలని చేస్తున్నావు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నీ అవినీతపైన ప్రాథమిక ఆధారాలతో మాట్లాడారు. నీ కోడలు పేరున ఉన్న ఆసుపత్రి, నీ మెడికల్ కాలేజి, నీ ఇంజినీరింగ్ కాలేజీలు, నీ యూనివేర్సిటీ భూములపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. రుజువు చేయాలని నువ్ డిమాండ్ చేస్తున్నావ్ కదా.. విచారణ ఆదేశించామని సీఎం. కేసీఆర్ అడుగు.. నీ అవినీతిని నిరూపించకపోతే మేము రాజకీయల నుంచి తప్పుకుంటాం,’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాలు విసిరారు.
రేవంత్ రెడ్డి నీ శాసనసభ పరిధి లోని మూడు చింతల పల్లి లో దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్ష వేదికలో నీ అవినీతిపైన ఆధారాలతో ప్రకటించారు కదా. నీ అవినీతిని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు కదా..రేవంత్ రెడ్డి ని రాజీనామా చేయమని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు కదా.. ఆయన అవినీతిపై విచారణ జరిపితే అవినీతి లేదని తేలితే రేవంత్ రెడ్డి రాజీనామా.చేస్తారు కదా..మీకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఉంటే అక్కడ నువ్ పోటీ చేయాలని ఉంటే నీ అవినీతి పైన విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకో…తిట్ల పురాణం చేయాలని, తిట్ల రాజకీయాలను చేయాలని చూస్తే మీకంటే మాకు ఎక్కువ తిట్లు వచ్చు;’’ అని కూడా దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.