హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ-4 కాటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నేడు ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 87 తేదీ 20 .9 .2021 ని విడుదల చేసింది.
తెలంగాణా ఎక్సయిజ్ చట్టం 1968 లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వ ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ఆ ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనిలో భాగంగా గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ఇచ్చిన జీ.ఓ పై తగు చర్య తీసుకోవాల్సిందిగా ప్రొహిబిషన్ ఎక్సయిజ్ శాఖ డైరెక్టర్ ను ఆదేశిస్తూ జీ.ఓ. విడుదల చేశారు.