విజయనగరం లో గొప్ప సంఘ సంస్కర్త , స్త్రీజనోద్దారకుడిగా పేరుపొందిన గురజాడ వారి పేరుతొ గురజాడ సమాఖ్యవారు గురజాడ పురస్కారాన్ని, ఒక చాంధసభావకుడు చాగంటికి ఇవ్వటాన్ని నిరసిస్తూ షుమారు పదిహేను సంఘాలవారు గురజాడ గారి ఇంటినుండి, గురజాడ బొమ్మవరకు షుమారు వంద మంది వివిధసంఘాల సభ్యులు ఊరేగింపుగా నిరసన ప్రదర్శన జరిపారు.
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కం లాంటి రచననల ద్వారా, ఆ రోజుల్లోజరిగే పాలుకూడా మరవని బాలికలను కన్యాశుల్కం ఇఛ్చి, 50 సంవత్సరాల ముసలివారికి పెండ్లిళ్లకు వ్యతిరేకంగా గురజాడ వారు జరిపిన ఉద్యమం సామాన్యమైనదికాదు.
ఇంకా వెయ్యి సంవత్సరాలదాకా ఈఉద్యమ ప్రభావం ఉంటుంది. అంతటి ఉద్యమకారుని పేరుతొ ఇచ్చే పురస్కారాన్ని ఒక మత చాందసునికి అనగా చాగంటికి ఇవ్వటం గురజాడ వారిని అవమానపర్చటమే అవుతుంది. పురుషుడు తిన్న ఎంగిలి కంచములో బార్య తిన్నట్లైతే ఆమె పుణ్యలోకాలకు పోతుందని, స్నానంచేసి పురుషుడు తన గోచిపోతను, ఉతక్కూడదని, భార్యమాత్రమె ఉతకాలని, అలాచేసిన స్త్రీ మోక్షం పొందుతుందని, స్త్రీలను అణగదొక్కే భావాలను ప్రవచిస్తున్న చాగంటికి ఇవ్వటం, గురజాడ వారిని అవమాన పరచినట్లేనని, కనుక గురజాడ కమిటీ వారు తమ ప్రతిపాదనను విరమించుకోవాలని, చాగంటికి ఏమాత్రం విలువలున్నా, తాను ఆపురాస్కారానికి అనర్హుడనని ప్రకటించి పురస్కారాన్ని తిరస్కరించాలని సంఘాల ప్రతినిధులు డిమాండు చెసారు .పాల్గొన్న సంఘాలు…సాహితి స్రవంతి , అరసం , జనవిజ్ఞానవేదిక, హేతువాద సంఘము, కొన్ని సంఘాలవారు, గురజాడ అభిమానులు.