మానవ హక్కుల వేదిక సంస్థ ఈ రోజు (శుక్రవారం) రాష్ట్రముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని కలిసి, ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారికి ఖైదీల విడుదల విషయంలో సూచనలతో ఒక పిటిషన్ సమర్పించడం జరిగింది.
ముఖ్యమంత్రి అందుబాటులో లేనందున, వారి కార్యదర్శి శేషాద్రికి పిటిషన్ అంద చేశారు. పిటిషన్ లో సూచించిన ఖైదీల విడుదలకు సంబంధించిన పలు అంశాలు కార్యదర్శి చర్చించారు.
మామూలుగా ప్రభుత్వాలు మారినప్పుడు జైళ్ళలో ఉన్న ఖైదీలను, వాళ్ళ అర్హతలను బట్టి విడుదల చేసే ఒక సాంప్రదాయం ఉంది. మానవ హక్కుల వేదిక, నూతనంగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభు త్వానికి ఈ క్రింది సూచనలు చేసింది.
1. తెలంగాణ రాష్ట్రంలోని 14 జైళ్లలో 276 మంది జీవిత ఖైదీలు
ఉన్నారు. ఇందులో 57 మంది 10 సంవత్సరాలు శిక్షపూర్తి చేసిన వారు, 9 మంది 25 సం, శిక్షపూర్తి చేసిన వారు ఉన్నారు. రెమిషన్ తో కలిసి పది సంవత్సరాలు పూర్తి చేసిన ఖైదీలను విడుదల చేయాలి.
2. చిన్న నేరాలు చేసిన ఖైదీ లందరి నీ వాళ్ల ప్రవర్తన, ఇతర అంశాలు సమీక్షించి వారి శిక్షలు సగo పూర్తియితే వారిని విడుదల చేయాలి.
2004లో వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు హోం శాఖకు సంబంధించిన G.0 MS .189 ద్వారా ఖైదీల విడుదల జరిగింది. ఈ G.0 వెలుగులో నే సమీక్ష జరిపి ఉదార వై ఖరి తో ఎక్కువ మందిని విడుదల చేయాలి.
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఆత్రం భుజంగ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,డాక్టర్. తి రుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సంఖ్యలు వేమన వసంత లక్ష్మి, ఎస్. జీవన్ కుమార్ లు ఈ పిటిషన్ పై సంత కాలు చేసారు. సమన్వమ కమిటీ సభ్యుడు జీవన్ కుమార్, నగర కమిటీ సంధ్యుడు బాపట్ల కృష్ణమోహన్ ప్రభు త్వానికి వీటిషన్ అందచేసారు.