- నాటకీయ పరిణామాల మధ్య నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్ లో పల్లెపోరుకు రంగం సిద్ధమయింది. విజయవాడ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం (జనవరి 23) విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికలకు వ్యతిరేకంగా వస్తే తప్పకుండా పాటిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఎన్నికలు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే జరుగుతాయని వెల్లడించారు. నాలుగు దశల్లో నిర్వహించనున్న ఎన్నికల్లో తొలిదశలో విజయనగరం ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాలలో ఎన్నికలు ఉంటాయని స్ఫష్టం చేశారు.
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమైన ఫిబ్రవరి 5న సర్పంచి ఉపసర్పంచి ఎన్నికతో ముగియనుంది.
జనవరి 23 నోటిఫికేషన్ జారీ
జనవరి 25 అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
జనవరి 28 నామినేషన్ల పరిశీలన
జనవరి 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి 30 అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు) అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5 పోలింగ్ తేది (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు
రెండో దశ :
- జనవరి 29 అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
- జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
- ఫిబ్రవరి 1 నామినేషన్ల పరిశీలన
- ఫిబ్రవరి 2 నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
- ఫిబ్రవరి 3 అభ్యంతరాలపై తుది నిర్ణయం
- ఫిబ్రవరి 4 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు) అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
- ఫిబ్రవరి 9 పోలింగ్ తేది (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది
ఇదీ చదవండి: గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ
మూడో దశ :
- ఫిబ్రవరి 2 అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఫిబ్రవరి 4 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
- ఫిబ్రవరి 5 నామినేషన్ల పరిశీలన
- ఫిబ్రవరి 6 నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
- ఫిబ్రవరి 7 అభ్యంతరాలపై తుది నిర్ణయం
- ఫిబ్రవరి 8 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు) అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
- ఫిబ్రవరి 13 పోలింగ్ తేది (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది
ఇదీ చదవండి: తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయాలు
నాలుగో దశ :
- ఫిబ్రవరి 6 అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఫిబ్రవరి 8 నామినేషన్ల దాఖలుకు తుది గడువు
- ఫిబ్రవరి 9 నామినేషన్ల పరిశీలన
- ఫిబ్రవరి 10 నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన
- ఫిబ్రవరి 11 అభ్యంతరాలపై తుది నిర్ణయం
- ఫిబ్రవరి 12 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు) అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
- ఫిబ్రవరి 17 పోలింగ్ తేది (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది