మార్చి 10న ఎన్నికలు
గతంలో ఆగిన చోటనుంచే జరగనున్న ఎన్నికలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 10 న పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడినుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువరించారు. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు. 12 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది.
Also Read: విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?
గత సంవత్సరం మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో 6563 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరపున నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోన వార్డు స్థానాలకు సుమారు 12000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ దశలో ఉండగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పట్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేస్తోందని ఎన్నికలను రద్దు చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రతిపక్షాల వాదనలకు ఎన్నికల సంఘం తిరస్కరించింది.
Also Read: నేతల నోటి దురుసు …కన్నెర్ర జేస్తున్న ఎస్ఈసీ
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ డీజీపీ గౌతం సవాంగ్ లు ఇటీవలే ఎస్ఈసీని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.